పాకిస్తాన్‌కు భారత్ మరోసారి బిగ్ వార్నింగ్.. ఈసారి పాకిస్తాన్ ఎన్ని ముక్కలవుతుందో తెలవదు..రాజ్‌నాథ్ సింగ్.

పాకిస్తాన్‌కు భారత్ మరోసారి బిగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. భారత్ తమపై దాడి చేస్తే, ఈసారి కోల్‌కతాపై దాడులు చేస్తామంటూ ప్రగల్భాలు పలికారు…

పశ్చిమ బెంగాల్‌పై కన్నేసే ప్రయత్నం చేస్తే పాకిస్థాన్‌ మరిన్ని ముక్కలవుతుందని హెచ్చరించారు.

మంగళవారం ఖ్వాజా అసిఫ్‌ చేసిన వ్యాఖ్యలపై రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందించారు. అసిఫ్‌ ఇటీవల ఓ కార్యక్రమంలో భారత్‌పై నోరు పారేసుకున్నారు. భవిష్యత్తులో భారత్‌ తమ దేశాన్ని దోషిగా నిలబెట్టి దాడులు చేస్తే ప్రతిస్పందనగా.. కోల్‌కతాపై దాడులు చేస్తామని అని అన్నారు. దీనిపై రాజ్‌నాథ్ సింగ్ పాక్‌ చరిత్రను గుర్తుచేశారు. ఈ తరహా వ్యాఖ్యలు చేసే 55 ఏళ్ల క్రితం పాకిస్థాన్‌పై రెండు ముక్కలైంది. ఇప్పుడు బెంగాల్‌పై కన్నేస్తే పాకిస్థాన్‌ ఎన్నిముక్కలవుతుందో ఆ దేవుడికే తెలియాలి’ అని హెచ్చరించారు.

1971లో పాక్‌ రెండు ముక్కలుగా విడిపోయింది. అందులో బంగ్లాదేశ్‌ విడిపోయి ప్రత్యేక దేశంగా అవతరించింది. బంగ్లాదేశ్‌కు మద్దతుగా భారత్‌ సైన్యం అండగా నిలిచింది. నాటి చరిత్రను తాజాగా రాజ్‌నాథ్‌ సింగ్‌ గుర్తు చేశారు. మరోసారి అదే తరహా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే పాకిస్థాన్‌ ముక్కలవుతుందని వ్యాఖ్యానించారు. గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్‌ ఆపరేషన్‌ సింధూర్‌ చేపట్టింది. నాటి నుంచి పాకిస్థాన్‌.. భారత్‌పై కవ్వింపు చర్యలకు దిగుతూ వస్తోంది. ఈ క్రమంలో ఖవాజా మరోసారి ప్రగల్భాలు పలికారు.

ఈ పరిణామాలపై తృణమూల్ కాంగ్రెస్ కూడా స్పందించింది. కోల్‌కతాపై దాడి చేస్తే పాక్‌లోని వారి ఇళ్లలోకి దూరి మరి చంపుతామని అధికార టీఎంసీ నేతలు వ్యాఖ్యానించారు. మొత్తం మీద, ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి. రాజ్‌నాథ్ సింగ్ చేసిన హెచ్చరికలు మాత్రం భారతదేశం తన భూభాగాన్ని రక్షించేందుకు ఎలాంటి రాజీపడదని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. బెంగాల్‌పై కన్నేసే ప్రయత్నం చేస్తే పాకిస్తాన్‌కు మరింత విభజన తప్పదని రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు.