జన్నారం పట్టణంలోని రాఘవేంద్ర సినిమా ధియేటర్లో జబర్దస్త్ రాకింగ్ రాకేష్ కేసీఆర్ కేశవ చంద్ర రామావత్ సినిమా చూశారు. శనివారం జన్నారం పట్టణానికి చిత్ర యూనిట్ సభ్యులు వచ్చారు..వీరికి బీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు. రాఘవేంద్ర థియేటర్లో అందరు కలిసి కేసీఆర్ సినిమాను చూశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పూర్ణచందర్ నాయక్, జాన్సన్ నాయక్ పాల్గొన్నారు..
గరుడవేగ అంజి తెరకెక్కించిన ఈ సినిమాలో సీనియర్ నటి సత్య కృష్ణన్ కూతురు అన్నన్య కృష్ణన్ హీరోయిన్ గా నటించింది. . గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాకింగ్ రాకేష్ స్వయంగా ఈ సినిమాను నిర్మించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్ పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పలు సార్లు వాయిదా పడిన కేసీఆర్ సినిమా ఎట్టకేలకు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇది తన మొదటి సినిమా కావడంతో రాకింగ్ రాకేష్ ఎమోషనల్ అయ్యాడు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ కు వెళ్లి తన మొదటి సినిమా మొదటి టికెట్ తానే స్వయంగా అమ్మారు. ఇందుకు సంబంధించిన వీడియోను సైతం తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఈ వీడియోలో టికెట్ కౌంటర్ లోకి వెళ్లి తనే స్వయంగా టికెట్ అమ్మాడు రాకేష్. టికెట్స్ తీసుకుంటున్నప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రాకింగ్ రాకేష్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే..