రంగారెడ్డి: మీర్జాగూడ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం…

రంగారెడ్డి: మీర్జాగూడ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం…

అదుపుతప్పి చెట్టును ఢీకొన్న స్పోర్ట్స్‌ కారు.

ప్రమాదంలో నలుగురు స్టూడెంట్స్‌ మృతి, మరొకరికి తీవ్రగాయాలు.

మృతులు సూర్యతేజ, సుమిత్‌, శ్రీనిఖిల్‌, రోహిత్‌గా గుర్తింపు..

నలుగురు ICFAI విద్యార్థులుగా గుర్తింపు..

ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్న పోలీసులు..

మోకిలా నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు నలుగు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక వాహన దారుల సమాచారంతో హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసలు మృతదేహాలను వెలికి తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ICFAI యూనివర్సిటీ, MGIT కి చెందిన ఐదుగురు విద్యార్థులు మోకిల నుంచి హైదరాబాద్‌ కు కార్లో బయల్దేరారు. అయితే వారు ప్రయాణిస్తున్న కారు మీర్జాగూడ వద్దకు రాగానే అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఒక విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను కార్లోంచి వెలికి తీసి, పోస్ట్‌ మార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. గాయపడిన వ్యక్తికి వైద్యం అందించారు.

అయితే ప్రమాదంలో చనిపోయిన నలుగురు వ్యక్తుల్లో సూర్యతేజా, సుమిత్, శ్రీనిఖిల్, రోహిత్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.ఇక రోడ్డు ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రమాదానికి గురైన కారును తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు పోలీసులు.

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959