రష్యాలో మంచు బీభత్సం..!

రష్యాలోని కంచట్కా ద్వీపకల్పంలో రికార్డు స్థాయిలో కురుస్తున్న మంచు బీభత్సం సృష్టిస్తోంది. 146 ఏళ్ల రికార్డును తిరగరాస్తూ కురుస్తున్న భారీ హిమపాతం తో వీధులన్నీ 3 మీటర్ల మేర మంచుతో నిండిపోయాయి. వాహనాలు పూర్తిగా కూరుకుపోవడంతో, నిత్యావసరాల కోసం ప్రజలు మంచును తవ్వి దారులు చేసుకోవాల్సి వస్తోంది. విద్యాసంస్థలు మూతపడగా, జనజీవనం పూర్తిగా స్తంభించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పరిస్థితి దారుణంగా ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు….

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959