ప్రభుత్వ ఆసుపత్రిలో రేబిస్ ఇంజెక్షన్ వికటించి చిన్నారి మృతి…!

ప్రభుత్వ ఆసుపత్రిలో రేబిస్ ఇంజెక్షన్ వికటించి చిన్నారి మృతి…

వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు

కామారెడ్డి జిల్లా కొటాల్‌పల్లి గ్రామం నుండి బతుకుదెరువు కోసం తమ ఇద్దరు పిల్లలతో కామారెడ్డి పట్టణంలో స్థిరపడ్డ రమేష్–అర్చన అనే దంపతులు

గత నెల 25వ తేదీన ఇంటి బయట ఆడుకుంటున్న తమ కూతురు క్రితార్స(రెండున్నర ఏళ్ళు)ను వీధి కుక్క కరవడంతో కామారెడ్డిలో బోధనాసుపత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు

ఇటీవల మూడవ డోస్ వ్యాక్సిన్ తీసుకుని ఇంటికి వెళ్లాక చిన్నారి అస్వస్థతకు గురవ్వడంతో, సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలింపు

ప్రైవేటు ఆసుపత్రిలో చిన్నారికి పల్స్ పడిపోయిందని చెప్పడంతో తిరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే చిన్నారి మృతిచెందినట్లు నిర్ధారించిన వైద్యులు..

దీంతో వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ కూతురు మరణించిందని, ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు..

చిన్నారి తండ్రి ఫిర్యాదు మేరకు విధుల్లో ఉన్న వైద్యుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు..