భారతీయ సినీ పరిశ్రమలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు నానా పటేకర్ కన్నుమూశారు. 75 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. గోవాలోని డోనా పౌలాలో ఉన్న తన నివాసంలో నానా పటేకర్ అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే కుటుంబ సభ్యులు, సిబ్బంది ఆయనను మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ప్రాణాలను కాపాడలేకపోయారు. వైద్యుల ప్రకారం.. నానా పటేకర్ తీవ్రమైన గుండెపోటుకు గురైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఉదయం 5:20 గంటలకు ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఆసుపత్రికి తీసుకువచ్చిన అనంతరం దాదాపు 45 నిమిషాల పాటు నిరంతరంగా సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడేందుకు వైద్య బృందం ప్రయత్నించింది. అయినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని మణిపాల్ ఆసుపత్రి ఆంకాలజీ విభాగం చీఫ్ డాక్టర్ శేఖర్ సల్కర్ తెలిపారు. ఈ ఘటనపై మెడికో-లీగల్ కేసు కూడా నమోదు చేసినట్లు వెల్లడించారు..
రైతుల కోసం సేవా కార్యక్రమాలు
నాందేడ్, పర్బని, హింగోలి, లాతూర్, ఉస్మానాబాద్ లాంటి కరవు జిల్లాల్లో పర్యటించి, వందలాది రైతుల కుటుంబాలకు చెక్కులతో పాటు దుప్పట్లు, వస్త్రాలు, మెడికల్ కిట్లు పంపిణీ చేసేవారు. వితంతువులైన రైతు భార్యలకు కుట్టు మిషన్లు, ఫ్లోర్ మిల్లులు, మేకలు అందజేసి స్వయం ఉపాధి కల్పించారు. రైతుల బిడ్డల చదువులకు, పెళ్లిళ్లకు ఆర్థిక సాయం చేయడంతో పాటు మెడికల్ కార్డుల ద్వారా ఉచిత వైద్యం అందించారు. కరవుకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఫౌండేషన్ తరఫున ఎండిపోయిన చెరువులు, నదులు, నాలాల పూడికతీత పనులను భారీ ఎత్తునచేపట్టారు. ఎన్నో గ్రామాలను దత్తత తీసుకొని, రైతులకు ప్రత్యేక శిక్షణ, ఉపాధి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒకసారి తాను కొనాలనుకున్న కోటిన్నర రూపాయల కారు ఆలోచనను విరమించుకుని, ఆ డబ్బును నేరుగా రైతు కుటుంబాలకే పంచేశారు..
60 రోజుల పాటు ఆర్మీలో!.
60 రోజులు కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నట్లు గతంలో నానా పటేకర్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. దేశానికి తనవంతు సాయం చేయాలన్న ఉద్దేశంతో నానా పటేకర్ ఆర్మీలో చేరాలనుకున్నారు. తన ఆకాంక్షను అప్పటి రక్షణశాఖ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్‌ను కలిసి చెప్పగా, ఆయన అంగీకరించలేదు. అలా చేరడం సాధ్యం కాదని చెప్పారు. తాను కమాండో కోర్సు చేశానని, ఆయుధాలను ఉపయోగించడంలోనూ అనుభవం ఉందని నానా పటేకర్, ఫెర్నాండెజ్‌కు వివరించారు. జాతీయ స్థాయిలో రైఫిల్ షూటింగ్ పోటీల్లో పాల్గొని కాంస్య పతకం సాధించిన విషయాన్ని చెప్పారు. అలా 60 రోజుల పాటు ఆర్మీలో నానా పటేకర్ పనిచేశారు. ద్రాస్, లెహ్, కుప్వారా, బారాముల్లా, సొపొరీ తదితర ప్రాంతాల్లో పనిచేశారు. అయితే ట్రూప్స్‌తో కలిసి ఏం చేశారన్న విషయాలను మాత్రం నానా పటేకర్ పంచుకోలేదు.
చెరగని నటనా ముద్ర..
సినిమాల విషయానికి వస్తే నానా పటేకర్ పోషించిన పాత్రలు ఎన్నో రకాలుగా ఉంటాయి. ఆవేశపూరిత కథానాయకుడు, భయపెట్టే ప్రతినాయకుడు, పోలీస్ అధికారి, హాస్య పాత్ర, ఏ పాత్రలో కనిపించినా తనదైన ముద్ర వేయడం ఆయన ప్రత్యేకత. సాంప్రదాయ గ్లామర్‌పై ఆధారపడకుండా కేవలం స్వరం, శరీర భాష, చూపులు, నిశ్శబ్దం, డైలాగ్ డెలివరీతోనే సన్నివేశానికి తీవ్రత తీసుకురాగలిగారు. ‘పరిందా’, ‘క్రాంతివీర్’, ‘అబ్ తక్ ఛప్పన్’ నుంచి ‘వెల్కమ్’ వరకు ఆయన సృష్టించిన పాత్రలు ప్రేక్షకుల జ్ఞాపకాల్లో నిలిచిపోయాయి.
ఆస్పత్రికి తీసుకొచ్చిన తర్వాత సుమారు 45 నిమిషాల పాటు నిరంతరాయంగా సీపీఆర్ చేసినప్పటికీ ఆయనను కాపాడలేకపోయామని, ఉదయం 5:10 గంటలకు ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. దీనిని మెడికో-లీగల్ కేసుగా నమోదు చేశామని, మరణానికి గల కచ్చితమైన కారణాలను నిర్ధారించేందుకు మృతదేహాన్ని బాంబోలిమ్‌లోని జీఎంసీహెచ్ తరలించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ఆశిశ్ తెలిపారు.