సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లో BRS పార్టీ భారీ బహిరంగ సభ..!

అధికార కాంగ్రెస్‌కు దీటుగా కార్యాచరణకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి లక్ష్యంగా ఆ పార్టీ ఇప్పటికే విమర్శలు గుప్పిస్తోంది. సీఎం రేవంత్‌ రెడ్డి నిర్వహిస్తున్న సభలకు కౌంటర్‌గా కొడంగల్‌లో బహిరంగ సభ నిర్వహించాలన్న ఆలోచనలో గులాబీ పార్టీ ఉంది. అనంతరం మంత్రుల నియోజకవర్గాల్లో సభలు నిర్వహించాలని భావిస్తోంది…..

తెలంగాణలో ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికల హామీల అమలులో జాప్యం, అవినీతి ఆరోపణలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇకపై కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించడంపై బీఆర్ఎస్లో చర్చ సాగుతోంది…

మరింతగా ప్రజల్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ సభలు సమావేశాలు..

బహిరంగ సభలు నిర్వహించే అంశంపై చర్చ
పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కొంతమంది ముఖ్య నేతలతో ఆ అంశంపై ఇప్పటికే చర్చించినట్లు సమాచారం. ముందుగా కొడంగల్‌లో సభ నిర్వహించి, ఆ తర్వాత రాష్ట్రంలోని మంత్రుల నియోజకవర్గాల్లోనూ బహిరంగ సభలు నిర్వహించే అంశంపై గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని లక్ష్యంగా ప్రజా క్షేత్రంలో పోరాటాన్ని ఉద్ధృతం చేయాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది..

ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు….

ఇటీవల కాలంలో బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో దూకుడుగానే వ్యవహరిస్తుంది అని అధికార పార్టీలు సైతం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి… అందుకు దీటుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా భారీ స్థాయి ఖర్చు చేస్తూ సోషల్ మీడియాలో కెసిఆర్ కుటుంబం పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించేలా వ్యవహరిస్తున్నారు… అయితే బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో వెనుకబడిందని ప్రచారం జరుగుతుంది..