గొంతులో చపాతీ రోల్ ఇరుక్కొని విద్యార్థి మృతి
గొంతులో చపాతీ రోల్ ఇరుక్కొని విద్యార్థి మృతి
తెలంగాణ : గొంతులో చపాతీ రోల్ ఇరుక్కొని విద్యార్థి మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ లో చోటు చేసుకుంది. అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్లో విరన్ జైన్ అనే విద్యార్థి ఆరో తరగతి చదువుతున్నాడు. అయితే స్కూల్లో భోజన విరామంలో చపాతీ తింటుండగా ముక్క గొంతులో ఇరుక్కుంది. వెంటనే అతన్ని గమనించి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందాడు. విద్యార్థి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
లంచ్ సమయంలో చపాతీ రోల్ తింటుండగా అది గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరి ఆడలేదు. అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం వెంటనే బాలున్ని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ విద్యార్థి మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తమ కుమారుడు మరణించాడన్న వార్తతో వారి కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.