ముందు వడ్లు కొనమని మంత్రికి చెప్పినందుకు ఆర్టీసీ డ్రైవర్ పై వేటు..
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల గురించి జగిత్యాలలో ధర్నా చేస్తున్న మంత్రి అడ్లురి లక్ష్మణ్, జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
నిరసన తెలుపుతుంటే ముందు వడ్లు కొనండని చెప్పినందుకు జగిత్యాల డిపోకు చెందిన బస్ డ్రైవర్ పై వేటు వేసి డ్యూటీకి రావద్దని రిమూవల్ లెటర్ ఇచ్చిన ఆర్టీసీ రీజినల్ మేనేజర్
అయితే తాను ఏ రాజకీయ పార్టీని లేదా నాయకుడిని విమర్శించలేదని, రైతుల గురించి మాత్రమే మాట్లాడానని తెలిపిన డ్రైవర్ అశోక్
ఆర్ఎం నుంచి రిమూవల్ లెటర్ వచ్చిందని, డ్యూటీకి రావద్దని సూచించినట్లు వెల్లడి..
నేను రాజకీయాల గురించి మాట్లాడలేదు, రైతుల గురించి మాట్లాడాను
డీజిల్, పెట్రోల్ ధరల గురించి ధర్నా చేస్తుంటే..ముందు రైతుల గురించి పట్టించుకోండి అని చెప్పాను
ఏ రాజకీయ పార్టీలను ఉద్దేశించి మాట్లాడలేదు, రైతుల గురించి మాట్లాడాను
– సస్పెండ్ అయిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్
జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి.మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్..
లేకపోతే ఆర్ఎం ఆఫీసు ముందు బైఠాయిస్తాం
మా ప్రభుత్వంలో మా మీద అనేక మంది విమర్శలు చేశారు, కానీ ఎవరిని ఇలా ఇబ్బంది పెట్టలేదు
రైతుల సమస్యల గురించి ప్రశ్నిస్తే కూడా ఇంత కఠిన చర్యలు తీసుకుంటారా?
అతనికి ఇచ్చిన రిమూవల్ లెటర్ వెనక్కి తీసుకునే వరకు రీజినల్ మేనేజర్ ఆఫీసు ముందు బైఠాయిస్తాం
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్…