నాగార్జునసాగర్ డ్యాం నుండి హెచ్చరికలు జారీ….

నాగార్జునసాగర్ డ్యాం నుండి హెచ్చరికలు జారీ..

తేదీ & సమయం: 20.08.2025, మధ్యాహ్నం 12:30 గంటలకు అప్పర్ క్యాచ్‌మెంట్ ప్రాంతంలో కురుస్తున్న వర్షపాతం మరియు శ్రీశైలం డ్యాం నుండి విడుదలలు పెరగడంతో నాగార్జునసాగర్ డ్యాం లోకి వస్తున్న ఇన్‌ఫ్లో పెరిగే అవకాశం ఉంది. అంచనా ఇన్‌ఫ్లో: సుమారు 4,90,000 క్యూసెక్కులు *(పెరగవచ్చు లేదా తగ్గవచ్చు)*.

ప్రస్తుతం అవుట్‌ఫ్లో: 3,89,206 క్యూసెక్కులు. ప్రతిపాదిత అవుట్‌ఫ్లో: మధ్యాహ్నం 1:00 గంటల నుండి 4,90,000 క్యూసెక్కుల వరకు క్రమంగా పెంచబడుతుంది. ఇన్‌ఫ్లో పరిస్థితుల ఆధారంగా అవుట్‌ఫ్లో ఇంకా పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. నాగార్జునసాగర్ డ్యాం డౌన్‌స్ట్రీమ్ ప్రాంతాలలో ఉన్న సంబంధిత అధికారులు మరియు ప్రజలు అప్రమత్తంగా ఉండి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరబడుచున్నది.