కోదాడలో ఏసీబీకి చిక్కిన అటవీశాఖ ఉద్యోగి…

సూర్యాపేట జిల్లా,
కోదాడ.

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని అటవీశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనంతల వెంకన్న 20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు….జగదీష్ చంద్ర, నల్గొండ ఏసీబీ డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం అనుమతులు లేకుండా చెట్లు నరుకుతున్న ఓ వ్యాపారిని బెదిరించి ప్రభుత్వానికి చలాన కట్టాలని సూచించాడు. చలాన కట్టేందుకు కార్యాలయానికి రాగా ప్రభుత్వానికి 120 చెట్లకు గాను 60వేలు చెల్లించాలని, దానికి బదులు తనకు 50వేలు ఇస్తే అన్ని అనుమతులు ఇస్తానని చెప్పాడు. చివరికి ఇద్దరి మధ్య 20వేలు ఒప్పందం కుదిరింది. సదరు వ్యాపారి నల్గొండ రేంజ్ ఏసీబీ కార్యాలయాన్ని ఆశ్రయించాడు. పథకం ప్రకారం వ్యాపారి కోదాడ శివారులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకన్నకు లంచం ఇస్తుండగా అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. నాంపల్లి కోర్టులో నిందితుని ప్రవేశ పెడతామని ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్ర తెలిపారు.
.