బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, తన సోదరి చీటి సకలమ్మ అనారోగ్యంతో మరణించిందని తెలియగానే శనివారం ఉదయం కేసీఆర్ ఆమె ఇంటికి వెళ్లారు. దివంగతులైన తన సోదరి చీటీ సకలమ్మ గారి పార్థివదేహానికి నివాళులర్పించారు. సకులమ్మ గారి కుటుంబ సభ్యులను కేసీఆర్ ఓదార్చారు.ఆయన వెంటనే బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఉన్నారు. అంతకుముందు హరీశ్ రావు, కేటీఆర్, కవిత సైతం సకలమ్మ పార్థివ దేహానికి నివాళ్లు అర్పించారు..
కేసీఆర్కు సకలమ్మ 5వ సోదరి. ఆమె స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పెదిర. భర్త హన్మంతరావు కొన్నేండ్ల క్రితమే మృతిచెందారు. వారికి ముగ్గురు కుమారులు ఉన్నారు..