నిర్మాణ రంగంలోకి స్టార్ హీరోయిన్ సమంత…!

సౌత్ ఇండియా స్టార్ సమంత ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవ్వాలని రెడీ అవుతుంది. పాన్ ఇండియన్ హీరోయిన్స్ గా దూసుకుపోతుంటే.. తాను కూడా రేస్ కు రెడీ అంటూ సిద్దమవుతుంది సామ్. మాయోసైటిస్ కారణంగా ఏడాది పాటు సినిమాలకు దూరమైన ఈ చిన్నది ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. సమంతకు తెలుగు, తమిళ్‌లో చాలా మంది అభిమానులు ఉన్నారు..

కథానాయిక సమంత చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆమె సొంత నిర్మాణ సంస్థ ‘త్రలాలా మూవింగ్‌ పిక్చర్స్‌’ బ్యానర్‌పై తొలి సినిమాగా తెరకెక్కిన ‘శుభం’ చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రానికి వసంత్‌ మరిగంటి కథను అందించగా, ‘సినిమా బండి’ ఫేమ్‌ ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకత్వం వహించారు. సి.మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్‌ పెరి, షాలిని కొండేపూడి, శ్రావణి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం త్వరలో థియేటర్లలో విడుదల కానుంది…