ఎస్బీఐ ఖాతాదారులకు ప్రమాద బీమా..!

ఎస్బీఐ తన ఖాతాదారులకు ప్రమాద బీమా అందిస్తోంది. ఎస్బీఐలో అకౌంట్ కలిగి ఉంటే(జీరో బ్యాలెన్స్ అయిన) ఏడాదికి రూ.1000 ప్రీమియంతో రూ.20 లక్షలు ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తుంది. అనుకోని ప్రమాదాలతో మరణం సంభవిస్తే నామినీకి పూర్తి నగదు అందిస్తారు. ఈ మేరకు ఎస్పీఐ జనరల్ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ అమలు చేస్తుంది..గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీని ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. సేవింగ్స్ బ్యాంక్ / వ్యక్తిగత కరెంట్ అకౌంట్ కలిగి ఉన్న భారతీయులు ఈ పాలసీకి అర్హులు. ఎస్బీఐ, దాని అనుబంధ బ్యాంక్‌లలో ఖాతా కలిగి ఉన్న 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు ఈ పాలసీ పొందవచ్చు. ఎస్బీఐ గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ప్లాన్ లో రూ.20 లక్షల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీని పొందవచ్చు. ఖాతాదారులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.20 లక్షలు వారి కుటుంబానికి చెల్లిస్తారు..