ఎస్సి హాస్టల్లో రాత్రిపూట బస చేసిన జిల్లా కలెక్టర్..

యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండల కేంద్రంలోని ఎస్సి హాస్టల్లో రాత్రిపూట బస కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు..

.జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ… జిల్లాలో ప్రతినెల ఒకరోజు హాస్టల్లో బస చేసే కార్యక్రమం లో భాగంగా ఈరోజు నారాయణపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్లో బస కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రెండు రోజుల్లో పదవ తరగతి పరీక్షలు ఉన్నందున విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులకు పరీక్షకు అవసరమయ్యే సామాగ్రి పెన్ను, పెన్సిల్,ప్యాడ్ ను విద్యార్థులకు అందజేశారు. విద్యార్థులు భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని కోరారు. హాస్టల్లో చదివే విద్యార్థులకు మంచి మార్కులు సాధిస్తే వారికి సైకిల్ అందచేస్తామని, జిల్లాలో మంచి మార్కులు విద్యార్థులు సాధించి జిల్లాకు మంచి పేరు తేవాలని తెలిపారు..