తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు ప్రకటన, తెలంగాణలో 13, ఏపీలో 10 రోజులు..!

తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు ప్రకటన, తెలంగాణలో 13, ఏపీలో 10 రోజులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు విద్యాసంస్థలకు దసరా సెలవులను ప్రకటించాయి. తెలంగాణలో అక్టోబర్ 10 నుంచి 22 వరకు 13 రోజులు సెలవులు ఇవ్వగా, తిరిగి అక్టోబర్ 23న విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. కాగా, ఏపీలో అక్టోబర్ 12 నుంచి 21 వరకు 10 రోజుల పాటు సెలవులు ఉంటాయని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది..

తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగలకు అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 22 వరకు సెలవులు ప్రకటించారు.. అక్కడ మొత్తం 13 రోజుల పాటూ సెలవులు ఇచ్చారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు గతంతో పోలిస్తే ఈ ఏడాది దసరా సెలవులు ఎక్కువగానే ఇచ్చారు. ఏపీలో 12 రోజులు కాగా.. తెలంగాణలో 13 రోజుల పాటూ సెలవులు ఇచ్చారు. ముఖ్యంగా స్కూల్ విద్యార్థులకు ఈసారి దసరా సెలవులతో పండగ చేసుకోనున్నారు. అలాగే ఈసారి ఏపీలో సంక్రాంతి సెలవులు వారం రోజుల పాటూ వచ్చాయి.

మరోవైపు ఏపీలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో మిగిలిన సెలవుల విషయానికి వస్తే.. అక్టోబర్ 2న జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సెలవు ఉంటుంది. నవంబర్ 19న దీపావళి సందర్భంగా సెలవు.. అలాగే డిసెంబర్‌లో విద్యార్థులకు క్రిస్మస్ సెలవులు ఉంటాయి. ఈ ఏడాది క్రిస్మిస్ సెలవులు డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 27 వరకు ఉంటాయి. ఇక 2027 జనవరిలో సంక్రాంతి పండుగకు సెలవులు ఉంటాయి.. జనవరి 11 నుంచి జనవరి 17వ తేదీ వరకు స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. మైనారిటీ విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు జనవరి 13 నుంచి ప్రారంభమవుతాయి.