సెహ్వాగ్ కొడుకు అద్భుతమైన బ్యాటింగ్..

అండర్-19 ఆసియా కప్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దుబాయ్‌లోని అల్ అమెరాట్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో యువ భారత్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. నేపాల్ నిర్దేశించిన 129 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 19.1 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఈజీగా ఛేదించింది. ఈ విజయంతో భారత్ గ్రూప్- Aలో అగ్రస్థానానికి చేరుకుంది…

సెహ్వాగ్ కొడుకు అద్భుతమైన బ్యాటింగ్…!

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తొలి నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు లక్ష్య రాజేశ్ (53 పరుగులు, 63 బంతుల్లో), సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ (70 పరుగులు, 52 బంతుల్లో) హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు. ముఖ్యంగా ఆర్యవీర్ 135 స్టైక్ రేట్తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అతడి ఇన్నింగ్స్లో 7 ఫోర్లు, 4 సిక్స్లు ఉన్నాయి. అంటే బౌండరీలతోనే అతడు 52 రన్స్ చేశాడు. బ్యాటింగ్ చేస్తుంన్నంతసేపు తన తండ్రి సెహ్వాగ్ను గుర్తుకు తెచ్చాడు. అభిమానులు అతడి ఇన్నింగ్స్ను ఎంజాయ్ చేశారు. మరోవైపు, కెప్టెన్ రాయచందాని రాజేశ్ కూడా అద్భుతంగా ఆడాడు. 64 బంతుల్లో అజేయంగా 54 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో అతను 7 ఫోర్లు కొట్టాడు. ఓపెనర్లు ఇద్దరూ కలిసి అజేయంగా 129 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత్ 19వ ఓవర్‌లోనే విజయాన్ని ఖాయం చేసుకుంది..

భారత్ తుది జట్టు : ఆర్యవీర్ సెహ్వాగ్, అన్వే ద్రవిడ్ (వికెట్ కీపర్), అర్జున్ రాజ్‌పుత్, ఇషాన్ సూద్, కావ్య పటేల్, లక్ష్య రాజేశ్ రాయచందనీ (కెప్టెన్), మనల్ చౌహాన్, మోహిత్ ఉల్వా, యశ్వీర్ గౌడ్, వీకే వినీత్, యశ్బర్ధన్ చౌహాన్.