బస్సులో మహిళను అసభ్యంగా తాకాడంటూ సోషల్‌మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఓ వ్యక్తి ప్రాణాలు తీసుకున్నాడు.
కేరళలోని కోజికోడ్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది..కోజికోడ్ జిల్లా గోవిందపురం గ్రామానికి చెందిన దీపక్ (42) శుక్రవారం ( జనవరి 16వ తేదీన) ఆర్టీసీ బస్సులో ప్రయాణించాడు. అదే సమయంలో తనతో, మరో మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని శిమ్జిత అనే మహిళ ఆరోపిస్తూ ఒక వీడియో తీసి తన సోషల్‌మీడియా ఖాతాలో పోస్టు చేసింది. రద్దీగా ఉన్న బస్సులో మహిళ శరీరాన్ని దీపక్ మోచేతితో తాకినట్లుగా ఆ వీడియోలో కనిపించింది. ఈ వీడియో కాస్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోకు 20 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
ఇలా మహిళను అసభ్యంగా తాకాడంటూ వీడియో వైరల్ కావడంతో.. అది చూసిన దీపక్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు అతనికి ధైర్యం చెప్పారు. అయినప్పటికీ పరువు పోయిందని భావించిన దీపక్ తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో దీపక్‌ను నిద్రలేపేందుకు ప్రయత్నించగా.. ఎంతసేపటికీ డోర్ తీయలేదు. దీంతో బలంగా డోర్‌ను పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా దీపక్ విగతజీవిగా కనిపించాడు. దీంతో శమ్జిత పెట్టిన వీడియో కారణంగానే దీపక్ ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబసభ్యులు, సన్నిహితులు ఆరోపిస్తున్నారు. “ఆ వీడియో దీపక్‌ను కుంగదీసింది. నిజం తెలియకుండా వీడియోలు పోస్టు చేయవద్దు. ఎవరి జీవితాలతో ఆడుకోవద్దు” అని దీపక్ సన్నిహితులు రిక్వెస్ట్ చేశారు.
పరువు పోయిందని ఆత్మహత్య..
వీడియో వైరల్ అయిన తర్వాత దీపక్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. పరువు పోయిందనే భావనతో అతడు పూర్తిగా కుంగిపోయాడని తెలిపారు. కుటుంబ సభ్యులు అతడికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, ఆదివారం ఉదయం అతడు తన గదిలో ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో లోపలికి వెళ్లి చూడగా దీపక్ విగతజీవిగా కనిపించాడు.ఈ ఘటనకు కారణం సోషల్‌మీడియాలో వైరల్ అయిన వీడియోనేనని దీపక్ కుటుంబసభ్యులు, సన్నిహితులు ఆరోపిస్తున్నారు. “నిజం పూర్తిగా తెలియకుండా వీడియోలు పోస్ట్ చేయడం వల్ల ఒక మనిషి ప్రాణం పోయింది. ఎవరి జీవితాలతో ఇలా ఆడుకోవద్దు” అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, సోషల్‌మీడియాలో పలువురు నెటిజన్లు దీపక్‌కు మద్దతుగా నిలుస్తున్నారు..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959