SIR Notice కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ప్రత్యేక సమగ్ర సవరణ(SIR)లో భాగంగా.. సామాన్యుల నుంచి రాజకీయ ప్రముఖులు, కేంద్ర మంత్రులు కూడా నోటీసులు ఎదుర్కొంటున్నారు. తాజాగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జై శంకర్(S Jai Shankar) కూడా నోటీసులు అందుకున్నారు. ఢిల్లీలో సర్ ప్రక్రియలో భాగంగా ఆదివారం జై శంకర్ ఆయన సతీమణి క్యొకో జై శంకర్కు ఈ లేఖలు అందాయి. వీరితో పాటు సీబీఐ డైరెక్టర్, మాజీ ఆర్మీ అధికారులు సర్ నోటీసులు అందుకున్నారు.ఓటరు జాబితాలో సవరణలో భాగంగా దేశవ్యాప్తంగా పలువురు సర్ నోటీసులు అందుకుంటున్నారు. ఢిల్లీలో ఆదివారం కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్కు కూడా నోటీసు వచ్చాయి. 2002 ఢిల్లీ ఓటరు జాబితాలో జై శంకర్, ఆయన భార్య పేరు లేవు. దాంతో, ఓటరు జాబితాలో అవసరమైన మార్పుల కోసం సరైన ధ్రువ పత్రాలు సమర్పించాలని వీరికి ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఆయన కుటుంబ సభ్యులకు బీఎల్వోలు సర్ నోటీసు ఇచ్చారు..తాజాగా సర్ నోటీసు అందుకున్న వారిలో ఆర్మీ మాజీ అధికారి ఉపేంద్ర ద్విదేది, ఆయన భార్య.. సుప్రీం కోర్టు మాజీ న్యాయవాది రంజన దేశాయ్, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు. ‘విదేశాంగ మంత్రి సహా పలువురు అధికారులు, మాజీ న్యాయవాది, వారి కుటుంబ సభ్యుకు సిస్టమ్ ఆధారిత నోటీసులు అందించాం. ఈసీఐఎన్ఈటీలో వీరు తమ వివరాలను సరి చేసుకోవాలని కోరాం’ అని ఢిల్లీ ఎన్నికల అధికారి వెల్లడించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.