మాజీ మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు(KTR) క్షమాపణలు.
(Apologizes) చెప్పారు. కేటీఆర్‌పై గతంలో చేసిన వ్యక్తిగత దూషణల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నానని, ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో ఆ విధంగా మాట్లాడానే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదన్నారు. ఆనాడు నేను చేసిన కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సి కాదని పశ్చాత్తాపాన్ని ప్రకటించారు..తొందరపడి నిరాధార వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని కొండా సురేఖ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యల వల్ల కేటీఆర్ లేదా ఆయన కుటుంబ సభ్యులు బాధపడి ఉంటే క్షమించాలని కోరారు. గతంలో తాను చేసిన నిరాధార వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు..
గతంలో కొండసురేఖ….
సుమారు రెండేళ్ల క్రితం కేటీఆర్‌ను విమర్శిస్తూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలతో ఆమె మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని, మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా న్యాయస్థానాల వరకు వెళ్లింది. కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్‌తో పాటు ఓ సినీ కుటుంబం కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమె వ్యాఖ్యలు తమ ప్రతిష్ఠకు భంగం కలిగించాయంటూ పరువు నష్టం దావా వేసింది. ఆ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేసింది…
మరోవైపు ఈనాడు దినపత్రిక సైతం ఇటీవలే కేటీఆర్‌కు క్షమాపణలు చెప్తూ పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. కేటీఆర్ పాస్‌పోర్టును సీజ్ చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇవ్వకపోయినప్పటికీ, ఇచ్చినట్టుగా ఈనాడు దినపత్రిక ఇటీవల తప్పుడు కథనం ప్రచురించింది. దీనిపై కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. దీంతో దిగొచ్చిన ఈనా డు యాజమాన్యం.. కేటీఆర్ పాస్‌పోర్టు వ్యవహారంలో తమ పత్రికలో తప్పుడు వార్తను ప్రచురించినట్టు అంగీకరించింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేయలేదని, పొరపాటున తప్పు జరిగిందంటూ పశ్చాత్తాపం వ్యక్తంచేసింది. తప్పుడు వార్త ప్రచురించినందుకు క్షమాపణలు కోరింది. ఇక ఈ వ్యవహారాన్ని ముగించాలని కేటీఆర్ తరపు న్యాయవాదిని కోరింది.