నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మహేష్ కుమార్ గౌడ్
క్షుద్ర పూజలు అంశంలో తనపై చేసిన తప్పుడు వ్యాఖ్యలను ఖండిస్తూ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్లపై పరువు నష్టం దావా వేసిన హరీష్ రావు
ఈ కేసులో విచారణకు హాజరైన అద్దంకి దయాకర్, మహేష్ కుమార్ గౌడ్ ..
తదుపరి విచారణను వచ్చే నెల 26కు వాయిదా వేసిన కోర్టు..
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తన్నీరు హరీశ్ రావు దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం దావా కేసులో టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ (ప్రభుత్వ విప్) అద్దంకి దయాకర్లకు The South First నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా అక్టోబర్ 29, 2026 న (ఈరోజు) వారిద్దరినీ కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది..
హరీశ్ రావు ఆలయ సందర్శనను వక్రీకరిస్తూ, తెలంగాణలో వర్షాలు పడకుండా నిరోధించేందుకు ఆయన “క్షుద్ర పూజలు” (చేతబడులు) చేశారంటూ మహేష్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్ గాంధీ భవన్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు…