చుక్క నీరు లేక వెలవెలబోతున్న మంజీరా ప్రాజెక్టు
డెడ్ స్టోరేజ్ దిశగా సింగూరు ప్రాజెక్టు..
వర్షాకాలంలోనే ఈ పరిస్థితి ఉంటే, రానున్న రోజుల్లో హైదరాబాద్ నగర ప్రజలకు కష్టకాలం తప్పదని హెచ్చరిస్తున్న నిపుణులు
కన్నెపల్లి వద్ద మోటార్లు ఆన్ చేసి నీటిని లిఫ్ట్ చేసి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని విమర్శలు..
వర్షాకాలంలోనే ఈ విధమైన తీవ్రమైన నీటి కొరత ఏర్పడటం స్థానికంగా మరియు హైదరాబాద్ నగర తాగునీటి సరఫరాపై ఆందోళన కలిగిస్తోంది..
మూడు పంటలుగా మూలనపడ్డ నాగలి.. బీడువారిన భూములు..
వర్షాలు ముఖం చాటేయడంతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సాగు నీరు అందక రైతాంగం తీవ్ర అవస్థలు పడుతోంది. ప్రాజెక్టుల్లో చుక్క నీరు లేక పంట కాలువలు ఎండిపోవడంతో రైతులు పంటలు వేయలేక చేతులెత్తేశారు. గడిచిన మూడు పంట కాలాలుగా రైతులు తమ సాగు భూములను వేయకుండా బీడుగా వదిలేయాల్సిన దుస్థితి ఏర్పడింది. జలాశయాల ఆధారంగా సాగయ్యే ఆయకట్టు ప్రాంతాలు ప్రస్తుతం నీరు లేక వెలవెలబోతున్నాయి..
పదేళ్ల నుంచి జలకళతో విలసిల్లిన ప్రాజెక్టులు వారికి ప్రజల పట్ల ఉన్న నిర్లక్ష్యం, పాలన చేతకాని తనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే ఇలా జరుగుతుందంటూ బిఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు ఇప్పించారు…