శ్రీశైలం డ్యామ్‌ దగ్గర భారీగా ట్రాఫిక్‌ జామ్‌…

శ్రీశైలం డ్యామ్‌ దగ్గర భారీగా ట్రాఫిక్‌ జామ్‌. జలాశయం మలుపు వద్ద మట్టిలో ఇరుక్కుపోయిన టూరిస్ట్‌ బస్సు. రోడ్డు మధ్యలో బస్సు ఇరుక్కుపోవడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌. డ్యామ్‌ నుంచి అటు దోమలపెంట, ఇటు సుండిపెంట వరకు ట్రాఫిక్‌ జామ్‌. సుమారు 5 కిలోమీరట్ల మేర నిలిచిపోయిన వాహనాలు…

జలాశయం నుంచి అటువైపు దోమలపెంట చెక్ పోస్టు, ఇటువైపు సుండిపెంట వరకూ ట్రాఫిక్ జామ్ ఉంది. వాహనాలు ఎటూ కదల్లేని పరిస్థితి ఉంది.
ఆ బస్సును పక్కకు జరిపితే తప్ప.. ట్రాఫిక్ క్లియర్ అవ్వదు. కానీ అది సాధ్యం కావట్లేదు. ఇటీవల అక్కడ కురిసిన వర్షాల వల్ల కొంత బురద ఏర్పడింది. ఇప్పుడు అక్కడే ఆ బస్సు ఇరుక్కుపోయింది.బస్సును పక్కను తప్పించినా.. వెంటనే ట్రాఫిక్ క్లియర్ అవ్వదు. ఎందుకంటే రెండువైపులా వాహనదారులు తామే ముందు వెళ్లాలని దూకుడుగా ముందుకొస్తారు. దాంతో.. ఎటూ ప్లేస్ ఉండదు. దాంతో ట్రాఫిక్ సమస్య వెంటనే తొలిగే అవకాశం తక్కువ. పూర్తిగా ట్రాఫిక్ క్లియర్ అవ్వాలంటే.. రాత్రివరకూ పట్టే పరిస్థితులు ఉండగలవు. అందువల్ల శ్రీశైలం డ్యామ్ వైపుగా వెళ్లాలనుకునేవారు అప్రమత్తం అవ్వాలి.