టి పోల్ యాప్ లో నామినేషన్ ల వివరాలను తప్పలు దొర్లకుండా జాగ్రత్తగా నమోదు చేయాలి..జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.

*సూర్యాపేట జిల్లా* ..

చింతలపాలెం మండలంలో పలు నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నంద్ లాల్ పవర్.

అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్ ఓ లు నామినేషన్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు.

చింతలపాలెం, దొండపాడు, మేళ్లచెర్వు, రామాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలలో ఏర్పాటుచేసిన గ్రామపంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నిక నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రామాపురం క్లస్టర్లో రామాపురం, యతిరాజపురం తండా,రామాంజనేయ తండా, రేవూరు దొండపాడు క్లస్టర్ లో దొండపాడు, వజీనేపల్లి, గాంధీ నగర్ తండా, పులిచింతల ప్రాజెక్ట్ కాలనీ అలాగే చింతలపాలెం క్లస్టర్ లో చింతలపాలెం, గుడిమల్కాపురం, కొత్తగూడెం,ఎర్ర కుంట తండా అలాగే మేళ్లచెరువు క్లస్టర్ లో మేళ్లచెర్వు, వెల్లటూరు, వెంకట్రాంపురం, ఎర్రగట్టు తండా గ్రామాలకు సంబంధించిన సర్పంచ్,వార్డు సభ్యుల ఎన్నిక నిమిత్తం నామినేషన్ పత్రాలను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.నామినేషన్ పత్రాలలో ఏమైనా సందేహాలు ఉంటే ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ద్వారా అడిగి తెలుసు కోవాలని తప్పులు రాయకూడదని సూచించారు.

జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం చివరి రోజు కాబట్టి ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు వస్తున్నందున దానికి తగ్గట్లుగా అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టోకెన్స్ జారీ చేసి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి నామినేషన్ పత్రాలు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు.

టి పోల్ యాప్ లో నామినేషన్ ల వివరాలను తప్పలు దొర్లకుండా జాగ్రత్తగా నమోదు చేయాలని సూచించారు.

కలెక్టర్ వెంట తహసిల్దార్లు రాజేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, ఎంపీడీవోలు ఆస్కర్ అలీ, రామ చంద్రరావు, ఎంపిఓ భూపాల్ రెడ్డి,ఆర్వోలు తదితరులు ఉన్నారు.