నేటి పంచాంగం..నేటి మాట..

ఓం శ్రీ గురుభ్యోనమః
పంచాంగం
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 06 – 12 – 2025,
వారం … స్థిరవాసరే ( శనివారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
హేమంత ఋతువు,
మార్గశిర మాసం,
బహుళ పక్షం,

తిథి : *విదియ* రా12.54 వరకు
నక్షత్రం : *మృగశిర* ఉ11.59 వరకు
యోగం : *సాధ్యం* ఉ7.07 వరకు
తదుపరి *శుభం* తె4.12 వరకు,
కరణం : *తైతుల* మ1.59 వరకు,
తదుపరి *గరజి* రా12.54 వరకు,

వర్జ్యం : *రా7.52 – 9.23*
దుర్ముహూర్తము : *ఉ6.19 – 7.48*
అమృతకాలం : *రా1.09 – 2.39*
రాహుకాలం : *ఉ9.00 – 10.30*
యమగండం : *మ1.30 – 3.00*
సూర్యరాశి : *వృశ్చికం*
చంద్రరాశి : *మిథునం*
సూర్యోదయం : 6.20,
సూర్యాస్తమయం : 5.21,

*_నేటి మాట_*

*మానవ జన్మ సార్థకం చేసుకోవడం ఎలా???*
జప, ధ్యాన, యోగముల కంటె కూడను సేవనే అతి శ్రేష్టమైనటువంటి యొక్క సత్యాన్ని మీరు గుర్తించాలి.
ఈ కర్మల ద్వారానే మానవుని యొక్క జన్మము సార్ధకము గావించుకోడానికి అవకాశం ఉన్నది.
“మన కర్మనే మన ముక్తి, మన కర్మనే మన భుక్తి, మన కర్మనే మన యుక్తి, మన కర్మనే మన యొక్క భక్తి”…
🎵 *కర్మమున పుట్టు జంతువు, కర్మముననే వృధ్ధి పొంది*
*కర్మమునే చనున్*
*కర్మమే నరునకు దైవము, కర్మమే సుఖ దు:ఖములకు*
*కారణమిలలో… కారణమిలలో..* 🎵

సర్వ ఫలములకును మూలాధారమై, కేంద్రమై, కీలకమైనటువంటి యొక్క కర్మను మనము నిష్కామ కర్మగా రూపొందింపచేసుకోవాలి.
మనము ఫలితమును ఆశించక, నా కర్తవ్యము ఇదియని, నా జన్మకు సరియైన మార్గమే ఇదియని మనం విశ్వసించి ఆ కర్మలో మనం నడవాలి.

*_🌸శుభమస్తు🌸_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏