రేపు “SSC (పదవ తరగతి)” హాల్ టికెట్లు విడుదల..
తెలంగాణ రాష్ట్రంలో
*• పదో తరగతి వార్షిక పరీక్షల హాల్ టికెట్లు గురువారం విడుదల కానున్నాయి.*
*• ఈ సారి మూడు రకాలుగా హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. వీటిని బోర్డు వెబ్ సైట్ లో విడుదల చేయడంతోపాటు తల్లిదండ్రుల వాట్సాప్ కు సైతం పంపిస్తారు. అదే తేదీలోపు ప్రింటెడ్ హాల్ టికెట్లను సైతం స్కూళ్లకు చేరవేస్తారు. హాల్ టికెట్ల కోసం https://bse.telangana.gov.in వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు. లేదంటే వాట్సాప్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కుదరని పక్షంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించి పొందవచ్చు. విద్యార్థులు ఏ హాల్ టికెట్ తో వచ్చినా పరీక్షలకు అనుమతిస్తారు.*
పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరుగనున్న విషయం తెలిసిందే. 5,28,248 మంది విద్యా ర్థులు పరీక్షలు రాయనున్నారు.
ఈ కొత్త విధానం ద్వారా పాఠశాల నిర్వహణపై మాత్రమే ఆధారపడకుండా.. అధికారిక వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు ఎదురు కాకుండా.. నేరుగా ఫోన్లోనే ఈ అడ్మిట్ కార్డులను అందించే లక్ష్యంగా ప్రవేశపెట్టారు. విద్యార్థుల స్కూల్ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఈ హాల్ టికెట్లు చేరతాయి. తెలంగాణ పదవ తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు నిర్వహిస్తారు. ..అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా విద్యార్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ బోర్డు సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో ‘ఎస్ఎస్సీ హాల్ టికెట్ 2026 డౌన్లోడ్ లింక్’ పై క్లిక్ చేస్తే నేరుగా డౌన్లోడ్ అయిపోతుంది. అక్కడ మీ అప్లికేషన్ నెంబర్ లేదా స్కూల్ లాగిన్ క్రెడియన్షియల్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసేయాలి. .