తమిళనాడులోని దేవాలయాల నుండి ఇవి చోరీకి గురైనట్లు పరిశోధనలో తేలడంతో, వీటిని భారత్కు తిరిగి అప్పగించేందుకు స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియంతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో త్వరలోనే ఈ విగ్రహాలు మళ్లీ మన దేశానికి చేరుకోనున్నాయి..
వాషింగ్టన్ లోని స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్ నుండి మూడు పురాతన శిల్పాలు తిరిగి భారతదేశానికి చేరుకోనున్నాయి…
మూడు పురాతన శిల్పాలను స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్ త్వరలోనే ఇండియాకు తిరిగి పంపనుంది. తొమ్మిదవ శతాబ్దానికి చెందిన శివ నటరాజ కాంస్య విగ్రహం, 12వ శతాబ్దానికి చెందిన శివ-ఉమల శిల్పం, 16వ శతాబ్దానికి చెందిన సెయింట్ సుందరర్ దంపతుల శిల్పాలను తిరిగి అప్పగించేందుకు, అమెరికాలోని భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ నమగ్యా ఖంపా ఇక్కడ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్ (NMAA) డైరెక్టర్ చేజ్ రాబిన్సన్తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు వీటిని త్వరలోనే ఇండియాకు పంపనున్నట్టు వార్ ఎక్స్ వేదికగా పోస్ట్లో పేర్కొన్నారు…