వాహనాలు గాల్లో ఎగిరి వెళ్లడాన్ని సినిమాల్లోనే చూస్తుంటాం.

భారీ వర్షాలకు గతంలో దెబ్బతిన్న బ్రిడ్జిని ఇప్పటివరకు కూడా పూర్తి చేయలేదు అధికారులు.. వాహనం దారులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్న కానీ అరకొర పనులు మాత్రమే నడుస్తున్నాయి..
ఇదే సమయంలో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది… ఏదో సినిమాలో చెప్పినట్టుగా ఓ డైలాగు ఉండేది,, ఏమో గుర్రం ఎగరావచ్చు అనే ఒక డైలాగు ఇక్కడ సరిగ్గా సరిపోయింది అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేసుకుంటున్నారు నెట్టిజనులు..

వాహనాలు గాల్లో ఎగిరి వెళ్లడాన్ని సినిమాల్లోనే చూస్తుంటాం. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం కందిబండ సమీపంలో నిజంగా అలాంటి ఘటన చోటు చేసుకుంది. మేళ్లచెరువులోని ఓ సిమెంటు కంపెనీలో ఆదివారం రాత్రి ఈ లారీ బస్తాలు లోడు చేసుకుని బయలుదేరింది. మేళ్లచెరువు-కోదాడ ప్రధాన రహదారిపై కందిబండ సమీపంలోని కొత్త వంతెన నిర్మిత ప్రదేశంలో ఉన్న డైవర్షన్‌ రోడ్డును డ్రైవరు గమనించలేదు.

రోడ్డుపై మట్టి కుప్పల్ని దాటుకుంటూ వేగంగా ముందుకెళ్లాడు. మార్గం మధ్యలో.. ఎగువ నుంచి వచ్చే వాగు నీటిని మళ్లించేందుకు వంతెన నిర్మిత ప్రదేశానికి కొంచెం వెనకగా రోడ్డు తవ్వి కాల్వ చేశారు. ఇది 10 అడుగులకు పైగా వెడల్పు, 25 అడుగులు లోతు ఉంది.

దీన్ని ఆలస్యంగా గమనించిన డ్రైవరు లారీని నియంత్రించలేక అలాగే లాగించేశాడు. నిజానికి వాహనం కాల్వలో పడి పెద్ద ప్రమాదం జరగాలి. కానీ, లారీ వేగంగా వెళ్తుండటంతో పెద్ద కాల్వను సెకన్ల వ్యవధిలో దాటేసింది. టైర్ల బేస్‌లు, కమాన్‌ కట్టలు, డీజిల్‌ ట్యాంకు మాత్రం దెబ్బతిన్నాయి. డ్రైవరుకు స్వల్ప గాయాలయ్యాయి..