స్వర్ణాంధ్ర విజన్-2047 లక్ష్య సాధనకు నేడు అత్యంత కీలకమైన రోజు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, ముఖ్యంగా స్వర్ణాంధ్ర విజన్-2047 లక్ష్య సాధనకు నేడు అత్యంత కీలకమైన రోజు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో కలిసి ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. సుమారు రూ. 18 వేల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం ద్వారా ఏపీ ప్రగతి పథంలో మరిన్ని అడుగులు ముందుకు వేస్తుందని స్పష్టం చేశారు. ఈ నూతన ప్రాజెక్టులు రాష్ట్రంలో ఎయిర్ మరియు రోడ్ కనెక్టివిటీని విశేషంగా పెంపొందించి, ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారుస్తాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు..
సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘సింహాచలం అప్పన్న, పైడితల్లి అమ్మవారికి ప్రణామాలు. 13,500 మంది గిరిజన మహిళల నృత్యం అద్భుతంగా ఉంది. అభివృద్ధితోపాటు థింసా నృత్యంలోనూ నేడు సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇది చంద్రబాబు విజన్‌కు మరో సాక్ష్యం. ఈరోజు రూ.18 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. ఈ ప్రాజెక్టులు ఏపీని మరింత ముందుకు తీసుకెళ్తాయి. కొత్త ప్రాజెక్టులు ఎయిర్‌, రోడ్‌ కనెక్టివిటీని పెంపొందిస్తాయి. చంద్రబాబు, పవన్‌ నేతృత్వంలో ఏపీలో డబుల్‌ అభివృద్ధి జరుగుతోంది