ఉత్తరాంధ్ర ప్రజలను తీవ్రంగా అవమానించారు. అలాంటి వారికి ఈరోజు దిమ్మతిరిగే సమాధానమే… నారా లోకేష్..
గతంలో ఈ ప్రాజెక్టును, ఉత్తరాంధ్ర ప్రజలను హేళన చేసిన ప్రతిపక్ష వైసీపీ నేతలకు లోకేష్ తన శైలిలో కౌంటర్ ఇచ్చారు. కొందరు ఎర్రబస్సు రాని ఊరికి విమానాశ్రయం అవసరమా అని ఉత్తరాంధ్ర ప్రజలను తీవ్రంగా అవమానించారు. అలాంటి వారికి ఈరోజు దిమ్మతిరిగే సమాధానమే ఈ అంతర్జాతీయ విమానాశ్రయం. ఎర్రబస్సు రాదు అన్న చోటకి ఈరోజు ఎయిర్ పోర్ట్ వచ్చింది, ఎయిర్ బస్ వచ్చింది.. ఏకంగా మన ప్రధాని నమో వచ్చారు! ఇదీ ఉత్తరాంధ్ర దెబ్బ… అర్థమైందా రాజా అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలు సభలో మారెత్తిపోయిన కేరింతలు, చప్పట్లతో హోరెత్తాయి.
ఉత్తరాంధ్ర అభివృద్ధిని పరుగులెత్తించడంలో కేంద్ర, రాష్ట్ర డబుల్ ఇంజిన్ సర్కార్ పాత్రను లోకేష్ కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ.. నమో అంటే ధైర్యం, నమో అంటే విశ్వాసం, నమో అంటే సురక్షిత భారత్.. శత్రువుల గుండెల్లో భయం అని అభివర్ణించారు. దేశంలో ప్రధాని మోదీజీ వికసిత్ భారత్ , రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడి విజన్ కలవడమే కాకుండా.. రైతుల త్యాగాలు, కార్మికుల కష్టానికి ప్రతిరూపంగా భోగాపురం ఎయిర్పోర్ట్ నిలిచిందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కట్టుబట్టలతో బయలుదేరిన ఆంధ్రప్రదేశ్ను ప్రధాని మోదీ అన్ని విధాలా ఆదుకున్నారని, విశాఖ రైత్ లైన్ జోన్, విశాఖ ఉక్కు పరిరక్షణ, గూగుల్ డేటా సెంటర్, ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వంటి బృహత్తర ప్రాజెక్టులు రాష్ట్రానికి రావడానికి మోదీజీ-నాయుడుజీ ద్వయమే కారణమని స్పష్టం చేశారు.
ఉత్తరాంధ్ర రూపురేఖలను శాశ్వతంగా మార్చేసే చారిత్రాత్మక ఘట్టం భోగాపురంలో ఆవిష్కృతమైంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ బహిరంగ సభలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అత్యంత ఉత్తేజభరితంగా ప్రసంగించారు..గతంలో ఈ ప్రాజెక్టును, ఉత్తరాంధ్ర ప్రజలను హేళన చేసిన ప్రతిపక్ష వైసీపీ నేతలకు లోకేష్ తన శైలిలో కౌంటర్ ఇచ్చారు. కొందరు ఎర్రబస్సు రాని ఊరికి విమానాశ్రయం అవసరమా అని ఉత్తరాంధ్ర ప్రజలను తీవ్రంగా అవమానించారు. అలాంటి వారికి ఈరోజు దిమ్మతిరిగే సమాధానమే ఈ అంతర్జాతీయ విమానాశ్రయం. ఎర్రబస్సు రాదు అన్న చోటకి ఈరోజు ఎయిర్ పోర్ట్ వచ్చింది, ఎయిర్ బస్ వచ్చింది.. ఏకంగా మన ప్రధాని నమో వచ్చారు! ఇదీ ఉత్తరాంధ్ర దెబ్బ… అర్థమైందా రాజా అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలు సభలో మారెత్తిపోయిన కేరింతలు, చప్పట్లతో హోరెత్తాయి.