ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్ దాడి ఘటనపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. ఆస్ట్రేలియాపై ఇజ్రాయెల్ సంచలన ఆరోపణలు చేసింది. ముందే అలర్ట్ చేయడంతో ఆస్ట్రేలియా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది..యూదుల వేడుకలను టార్గెట్ చేసిన ఉగ్రమూక దాడిలో 11 మంది మృతిచెందగా.. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్ట్‌లు హతమయ్యారు.
యూదులపై దాడులు జరగవచ్చని ఆస్ట్రేలియాకు ముందే హెచ్చరికలు ఇచ్చామని.. యాంటీ-సెమిటిజాన్ని అరికట్టడంలో చర్యలు తీసుకోలేదని ఇజ్రాయెల్ విమర్శించింది. ఈ సందర్భంగా సిడ్నీ కాల్పుల ఘటనపై ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ ట్వీట్ చేశారు. సిడ్నీ కాల్పుల ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇప్పటికైనా ఆస్ట్రేలియా ప్రభుత్వం మేల్కొని తగిన చర్యలు తీసుకోవాలి’అని పేర్కొన్నారు..మరోవైపు, సిడ్నీ ఉగ్రదాడిని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ తీవ్రంగా ఖండించారు. యూదులపై అత్యంత క్రూరమైన దాడిగా అభివర్ణించారు. ఆస్ట్రేలియా అధికారులు యాంటీ-సెమిటిజాన్ని ఎదుర్కోవడంలో మరింత కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మన సోదరులు, సోదరీమణులు.. ఉగ్రవాదుల చేతిలో అత్యంత క్రూరమైన దాడికి గురయ్యారు’ అంటూ హెర్జోగ్ యెరూషలేములో జరిగిన ఒక కార్యక్రమంలో విచారం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాను వేధిస్తున్న ‘యాంటీ-సెమిటిజం’ని ఎదుర్కోవడానికి పోరాడాలని పిలుపునిచ్చారు. కాగా, ఈ ఉగ్రదాడి యూదులే లక్ష్యంగా జరిగిందా? అనేదానిపై ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.
బాండీ బీచ్‌లో కాల్పుల ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ అన్నారు. ఈ ఘటన దృశ్యాలు కలచివేస్తున్నాయని.. బాధితులకు తన ప్రగాఢ సానుభూతి” అంటూ అల్బనీస్ ట్వీట్ చేశారు..
ఇదే సమయంలో సిడ్నీ ఉగ్రవాద దాడిలో పాకిస్థాన్‌తో సంబంధాలు బయటపడినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సీనియర్ లా ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. బోండి బీచ్‌లో కాల్పులు జరిపిన నిందితుల్లో ఒకరిని సిడ్నీలోని బోనీరిగ్‌కు చెందిన నవీద్ అక్రమ్గా గుర్తించినట్లు తెలిపారు. అతను పాకిస్థాన్‌లోని లాహోర్‌కు చెందిన వాడని వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా ఆదివారం సాయంత్రం 24 ఏళ్ల నవీద్ అక్రమ్ ఇంటిపై పోలీసులు దాడి చేశారు.
నవీద్ అక్రమ్ ఎవరో తెలుసా..
పలు నివేదికల ప్రకారం.. ఈ 24 ఏళ్ల నవీద్ అక్రమ్ వాస్తవానికి పాకిస్థాన్‌లోని లాహోర్‌కు చెందినవాడు. అతను సిడ్నీలోని అల్-మురాద్ ఇన్స్టిట్యూట్లో విద్యార్థిగా ఉన్నాడు. ప్రస్తుతం ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న ఫోటోలో ఆయన పాకిస్థాన్ క్రికెట్ జెర్సీ ధరించి ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ కాల్పుల్లో పాల్గొన్న ఇద్దరు ముష్కరులలో ఒకరు సంఘటనా స్థలంలోనే మరణించగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అధికారులు ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. ఈ కాల్పుల్లో మూడో ముష్కరుడు కూడా పాల్గొన్నాడా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వైరల్ వీడియో ప్రకారం.. జనాలపై దాడి చేసిన వారిలో నవీద్ అక్రమ్ ఉన్నాడని, అయితే అతను నిరాయుధుడిగా ఉన్నాడని, కానీ అక్కడి నుండి పారిపోయిన తర్వాత మరిన్ని కాల్పులు జరిపాడని సమాచారం. అలాగే బోండిలోని కాంప్‌బెల్ పరేడ్‌లోని ఒక వాహనంలో అనేక ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాలను అధికారులు గుర్తించారు. ప్రస్తుతం రెస్క్యూ బాంబు డిస్పోజల్ యూనిట్ ఈ వాహనంలో ఉన్న పేలుడు పరికరాలను డిస్పోజ్ చేస్తుంది.
ఇది ఉగ్రవాద దాడి: ఆస్ట్రేలియా పోలీసులు
ఈ సందర్భంగా NSW పోలీస్ కమిషనర్ మాల్ లాన్యన్ మాట్లాడుతూ.. ‘సంఘటన స్థలంలో లభించిన ఆయుధాల రకం… దర్యాప్తులో లభించిన మరికొన్ని ఆధారాలు ప్రకారం ఇది ఉగ్రవాద దాడి. అలాగే మేము మరణించిన నేరస్థుడికి సంబంధించిన కారులో ఒక అధునాతన పేలుడు పరికరాన్ని గుర్తించాము’ అని ప్రకటించారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. ‘ఇది ప్రతీకారం తీర్చుకునే సమయం కాదు, పోలీసులను వారి పని చేయనివ్వాల్సిన సమయం ‘ అని అన్నారు..
ఉగ్రమూకపై తిరగబడి.. వైరల్ వీడియో.
https://x.com/i/status/2000140804409749523