తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై అరెస్ట్..

తమిళనాడులో ఇటీవల సీఎం స్టాలీన్ హింది భాషపై మండిపడుతున్నారు. హింది భాష అనేక స్థానిక భాషల్ని నిర్వీర్యం చేస్తుందని తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు…బహిరంగంగానే.. హిందిపైన తమ వ్యతిరేకతను బైటపెట్టారు. ఈ క్రమంలో తాజాగా.. తమిళనాడులో త్రిభాష విధానానికి మద్దతుగా బీజేపీ నేత అన్నామలై, తెలంగాణ మాజీ సీఎం తమిళి సై సైతం.. ఎంజీఆర్ నగర్ లో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

దీనిలో భాగంగా అనేక మంది బీజేపీ కార్యకర్తలు దీనిలో పాల్గొన్నారు. త్రిభాష విధానం ఉంటే తప్పేంటని తమిళి సై ప్రభుత్వంను నిలదీశారు. మన విద్యార్థులు విద్యా, ఉద్యోగాలలో అనేక అవకాశాలు లభిస్తాయని అన్నారు..