ఈనెల 27న తెలంగాణకు రానున్న రాహుల్ గాంధీ, ఖర్గే..

కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 27న తెలంగాణకు వస్తారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు..సంవిధాన్ బచావో ర్యాలీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు పాల్గొంటారని మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. మరోవైపు కేసీ వేణుగోపాల్ వార్నింగ్ పైన మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు.

అందరి రిపోర్ట్ కేసీ దగ్గర ఉంది..
అందరి రిపోర్టు కేసీ దగ్గర ఉందని, 20ఏళ్లు దృష్టిలో పెట్టుకుని పని చేయాలని కేసీ వార్నింగ్ ఇచ్చారని అన్నారు. ఇక టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు మహేశ్ కుమార్ గౌడ్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను మూడు రోజుల్లో ప్రకటిస్తామన్నారాయన.

పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ గాంధీభవన్ లో మీడియాతో చిట్ చాట్ చేసి పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 27న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ఇద్దరూ కూడా తెలంగాణకు వస్తారని తెలిపారు. సంవిధాన్ బచావో ర్యాలీలో వారు పాల్గొంటారని వెల్లడించారు….

ఈ మేరకు మంగళవారం పార్టీ శ్రేణులకు లేఖ రాశారు. ”రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్న బీజేపీ కుట్రలకు వ్యతిరేకంగా, రాజ్యాంగం పరిరక్షణకు నిర్వహించిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(CWC) సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది..