బాలయ్య బాబు సినిమా వస్తుంది అంటే పక్కా హిట్ అనేలా టాక్ వచ్చింది. హ్యాట్రిక్ హిట్లతో దూసుకెళ్తున్న బాలకృష్ణ బాబీ Babi డైరెక్షన్ లో డాకు మహారాజ్ గా వస్తున్నాడు.బాలయ్యతో సినిమా ఎలా తీస్తే ఫ్యాన్స్ కి మాస్ ఆడియన్స్ కి రీచ్ అవుతుందో ఆ లెక్కలు సరిగా వేసుకుని బాబీ ఈ సినిమా తీసినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా సినిమాలో తన మార్క్ యాక్షన్ సీన్స్ అదరగొట్టినట్టు ఉన్నాడు. డాకు మహారాజ్ కథ ఏంటి అన్నది ట్రైలర్ లో క్లియర్ గా తెలియట్లేదు కానీ బాలకృష్ణ మాస్ బీభత్సం ఉంటుందని తెలుస్తుంది.
Daaku Maharaaj Movie Review :
ఇక థమన్ మ్యూజిక్ సినిమాకు మరో హైలెట్ కాబోతుంది. సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్న శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యాలు నటన పరంగా ఊర్వశి రౌతెలా గ్లామర్ పరంగా అదరగొట్టబోతున్నారు. సినిమా కథ మీద ఉన్న నమ్మకంతో నిర్మాతలు భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కించారు. బాలకృష్ణ మార్క్ మాస్ తో పాటు బాబీ డైరెక్షన్ టాలెంట్ కూడా ఈ సినిమాలో పొందుపరిచారు. నందమూరి ఫ్యాన్స్ కి మాత్రమే కాదు మాస్ ఆడియన్స్ కి అందరికీ సినిమా ఫుల్ మీల్స్ అందిస్తుందని తెలుస్తుంది. ముఖ్యంగా బాలయ్య ఎనర్జీని పర్ఫెక్ట్ గా డైరెక్టర్ బాబీ వాడుకున్నట్టు అర్ధమవుతుంది. థమన్ బిజిఎం కూడా సినిమాకు మరో అసెట్ గ నిలిచేలా ఉన్నాయి.
నటీనటులు : నందమూరి బాలకృష్ణ్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతెల, ప్రగ్య జైస్వాల్, బాబీ డియోల్ తదితరులు
సంగీతం : ఎస్ థమన్
సినిమాటోగ్రఫీ : విజయ్ కార్తీక్ కన్నన్
దర్శకత్వం : కె.ఎస్ బాబీ
నిర్మాత : సూర్యదేవర నాగవంశీ
డాకు మహారాజ్ పై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. వాటికి తగినట్టుగానే ప్రచార చిత్రాలు అదిరిపోయాయి. సినిమా సంక్రాంతి కానుకగా ఆదివారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూ మరికొద్ది క్షణాల్లో మీకు అందిస్తాం. ..
యానిమల్ విలన్
డాకు మహారాజ్ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్‌గా నటించారు. యానిమల్ యాక్టర్ బాబీ డియోల్ విలన్‌గా చేశాడు. ఇక దబిడి దిబిడి అనే ఐటమ్ సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటి ఊర్వశి రౌటెలా పర్ఫామ్ చేసింది.
డాకు మహారాజ్ ఫస్ట్ రివ్యూ
జనవరి 10న గ్రాండ్‌గా డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. సినిమా రిలీజ్ ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీంతో డాకు మహారాజ్‌పై మరింతగా అంచనాలు పెరిగిపోయాయి. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా డాకు మహారాజ్ మూవీ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో డాకు మహారాజ్ ఫస్ట్ రివ్యూ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.
మరికొన్ని గంటల సమయం
సౌత్ ఫిల్మ్ క్రిటిక్ అండ్ ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా చెప్పుకుంటూ కాంట్రవర్సియల్ ట్వీట్స్ చేసే ఉమైర్ సంధు డాకు మహారాజ్ మూవీపై రివ్యూ ఇచ్చాడు. అయితే, ఓవర్సీస్లో డాకు మహారాజ్ సెన్సార్ స్క్రీనింగ్ జరిగినట్లు తెలుస్తోంది. అక్కడ వీక్షించిన ఉమైర్ సంధు రివ్యూ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే, సినిమా రిలీజ్‌కు మరికొన్ని గంటల సమయం ఉండగా.. డాకు మహారాజ్ రివ్యూ ఆసక్తిగా మారింది..
Balakrishna, Daaku Maharaaj Movie Review , Daku Maharaj Review , Daaku Maharaaj Review