పీసీ ఘోష్ కమిషన్ నిలిపివేసిన తెలంగాణ హైకోర్టు
పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు….
తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావులకు ఊరట…
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించిన హైకోర్టు..
ఆ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని పేర్కొన్న న్యాయస్థానం..
సెక్షన్ 8 కింద నోటీసులు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు అని తెలిపిన హైకోర్టు..
రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశం
కమిషన్ ఏర్పాటును హైకోర్టులో సవాల్ చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు
జస్టిస్ పీసీ ఘోష్ విచారణ ప్రక్రియ అంతా ఏకపక్షంగా సాగిందని, తమ వివరణను పరిగణనలోకి తీసుకోకుండానే నివేదిక ఇచ్చారని కేసీఆర్ మరియు హరీష్ రావు కోర్టును ఆశ్రయించారు. తమను రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వం కమిషన్ వివరాలను మీడియాకు లీక్ చేస్తోందని, అందుకే ఈ కమిషన్ నివేదికను రద్దు చేయాలని వారు తమ పిటిషన్‌లో కోరారు.
కేసీఆర్, హరీష్ రావు పిటీషన్ల పై విచారణ జరిపిన హైకోర్టు, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను నిలిపి వేస్తూ తీర్పునిచ్చింది హైకోర్టు..
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అంశంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. కేసీఆర్, హరీశ్ రావు తరపున న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపిస్తూ.. అసెంబ్లీలో తీర్మానం లేకుండానే ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించిందని తెలిపారు. ఘోష్ కమిషన్ నివేదిక రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని, దీని ఆధారంగా తమపై ఏకపక్షంగా చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలని కోరారు.