నేడు రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. సభ ప్రారంభమైన అనంతరం మొదట ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరగనుంది..
నేటి సమావేశాల్లో మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కీలక చర్చ జరగనుంది. ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సభలో తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ అంశంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య విస్తృత స్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉంది.
అలాగే, నేటి సభలో జీహెచ్ఎంసీ బిల్లుతో పాటు పలు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లులపై చర్చలు, ఆమోదం పొందడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959