హామీల అమలుపై నాలుగేళ్లు కాంగ్రెస్ కాంగ్రెస్పై పోరాడదామని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్మిక విభాగం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా తెలంగాణ భవన్కు రావాలని ఆయన కోరారు. ఇక నుంచి తెలంగాణ భవన్.. తెలంగాణ జనతా గ్యారేజ్ అని చెప్పారు..అధికారం కోల్పోయినప్పటికీ పోరాటపటిమ పోలేదన్న రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ కార్మిక విభాగం పోరాడుతుంది. హమాలీల సమస్యలు ఏంటో తెలుసుకోకుండానే చాలామంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో పనిచేశారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మొదటి 15 రోజుల్లోనే హమాలీలను పిలుచుకొని మాట్లాడి వాళ్ల సమస్యలను పరిష్కరించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఎనిమిది రూపాయలు ఉన్న హమాలీ కూలీ ఆయ హయాంలోనే 26 రూపాయలకు చేరింది.
కరోనా కాలంలో కేసీఆర్ ప్రెస్ మీట్ కి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా టీవీల ముందు ఎదురు చూశారు. ఆయన చెప్పే మాట వినాలని చూశారు. ఆనాటి పాలకులు అంగన్వాడీ టీచర్లను గుర్రాలతో తొక్కిస్తే కేసీఆర్ అదే అంగన్వాడీ టీచర్లకు 4500 రూపాయలు ఉన్న జీతాన్ని 13,650 రూపాయలకి పెంచారు..మినీ అంగన్వాడీ టీచర్లకు 2200 రూపాయలుగా ఉన్న జీతాన్ని 7800 రూపాయలు చేశారు. 2014లో ఆశా వర్కర్లకు 2500 రూపాయల జీతం ఉంటే దాన్ని 9750 రూపాయలకు పెంచారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కంటే అత్యధిక పే స్కేల్ తెలంగాణ ఉద్యోగులకు ఇస్తానని ఉద్యమ సమయంలోనే కేసీఆర్ చెప్పారు.
చెప్పిన మాట ప్రకారం 73% జీతాలను తెలంగాణ ఉద్యోగులకు పెంచారు. భారతదేశంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధికంగా జీతాలు ఇచ్చే రాష్ట్రం గా తెలంగాణను కేసీఆర్ నిలిపారు” అని కేటీఆర్ అన్నారు..
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హామీలన్నీ అమలు చేస్తామని భట్టి విక్రమార్కతో పాటు అందరూ మాట్లాడారు. కానీ చేసిందేమీ లేదు. రిటైర్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తలేరు. డీఏలు పెండింగ్లో ఉన్నాయి. పీఆర్సీకి దిక్కు లేదు. ఎప్పుడైనా మనం ఆస్తులు, అప్పులు చూడాలి. ఒక్క ఏడాదిలో రేవంత్ రెడ్డి ఒక లక్షా 40 వేల కోట్ల అప్పు చేసిండు. కేసీఆరేమో ఏడాదికి రూ. 40 వేల కోట్లు అప్పు చేసి అభివృద్ధి కోసం ఖర్చు పెట్టిండు. కానీ రేవంత్ రెడ్డి చేసిన లక్షా 40 వేల కోట్ల అప్పుతో.. కొత్త ఇటుక పెట్టావా.. కాల్వ తవ్వినావా.. రైతుబంధు పెంచావా.. 2500 ఇచ్చావా.. తులం బంగారం ఇచ్చావా.. స్కూటీ ఇచ్చావా.. మరి ఏం పీకినవ్ వన్ ఇయర్లో.. మరి లక్షా 40 వేల కోట్లు ఎక్కడ పోయాయి రేవంత్ రెడ్డి..? కేసీఆర్ సాగునీరు తెచ్చిండు, మంచినీరు మంచిగా చేసిండు. రోడ్లు బాగు చేసిండు. సంక్షేమం చేసిండు. కార్మికులను కర్షకులను మంచిగా చూసుకుండు. ఒక్కటి మాత్రం రేవంత్ చేసిండు.. ఢిల్లీకి మూటలు మాత్రం జోరుగా మోసిండు.. వేల వేల కోట్లు పంపి కుర్చీని కాపాడుకుంటున్నాడు అని కేటీఆర్ ఆరోపించారు..