రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ శనివారం తెలంగాణ బంద్ నిర్వహించనుంది. ఈ బంద్‌కు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతోపాటు పలు ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. విద్యాసంస్థలు, వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని బీసీ జేఏసీ కోరడంతో ఆయా వర్గాలు కూడా సానుకూలత వ్యక్తం చేశాయి. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, విద్యాసంస్థలు సెలవు ప్రకటించాయి. కాగా, బంద్కుటీజీఎస్ఆర్టీసీ కూడా మద్దతు తెలపాలని బీసీ సంఘాలు కోరాయి. దీనిపై ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా కొంతమేర సుముఖత వ్యక్తం చేశాయి. అయితే ఉదయం బంద్‌లో పాల్గొని, తీవ్రత తగ్గిన తరువాత బస్సులు నడపాలని ఆర్టీసీ సంఘాలు నిర్ణయించాయి. కాగా, బీసీల బంద్‌కు అధికార కాంగ్రెస్ పూర్తి మద్దతునిస్తున్నట్టు ప్రకటించింది. బీసీలకు రిజర్వేషన్ల విషయంలో వెనకడుగు వేసేది లేదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలంతా బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కూడా బంద్‌కు తమ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు కూడా బంద్‌కు మద్దతు ఉంటుందని తెలిపారు…
బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర బంద్‌కు సంఘీభావంగా శుక్రవారం బషీర్‌బాగ్‌లోని బాబుజగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద నుంచి లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. చిక్కడపల్లిలో బీసీ మేధావుల ఫోరం చైర్మన్ చిరంజీవులు. బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాల్‌రాజ్‌గౌడ్, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్ విశారదన్ మాహారాజ్ విలేకరులతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం 24న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఇందిరాపార్కు వద్ద మహాధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. బంద్ నేపథ్యంలో శనివారం నగరంలోని వివిధ వృత్తివిద్యా కళాశాలలు మూసివేయాలని ప్రైవేటు యాజమాన్యాలు నిర్ణయించాయి. శనివారం సెలవు ప్రకటించాయి. బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్‌కు ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘాలు, రాజకీయ పార్టీల తరఫున సంఘీభావం తెలుపుతున్నట్లు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు..
కాంగ్రెస్ ప్రభుత్వం బంద్ లో పాల్గొనడం చిత్రంగా ఉంది.. సోషల్ మీడియాలో పలువురు అభిప్రాయం..
రిజర్వేషన్ అమలు చేయాలని చేసింది కాంగ్రెస్.. సరైన పద్ధతిలో అమలు చేయకపోవడంతో ఆ పద్ధతి కరెక్ట్ కాదంటూ నిలిపివేసింది ధర్మాసనం..
ఈ బంద్ ఎవరిపై ఒత్తిడికి ఎవరికోసం… ఎవరి చేస్తున్నారు… తెలంగాణ లో అధికారం ఉన్నది ఎవ్వరు. వారు బందులో పాల్గొనడం ఏందంటూ విమర్శలు వెల్లివెత్తుతున్నాయి… అధికార పార్టీ అయ్యుండి సరైన పద్ధతిలో బీసీ రిజర్వేషన్ అమలు చేయకపోవడంతోనే ఇంత తలకాయ నొప్పి ఎదురైందంటూ పలువురు సోషల్ మీడియాలో అధికార కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు…… ఇప్పుడు అదే అధికార పార్టీ రోడ్డెక్కి ధర్నా చేయడం ఏమిటో అర్థం కావడం లేదంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..