కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన కామెంట్లు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం… బీసీ నేతను తక్కువ చేసి మాట్లాడతారా సొంత పార్టీ నాయకుల విమర్శలు….!

మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీపీసీసీ చీఫ్​ చేస్తే వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు వస్తాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన కామెంట్లు కాంగ్రెస్ పార్టీలో వంద సీట్లు వస్తాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన కామెంట్లు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాష్ట్ర ఖనిజావృద్ది సంస్థ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్.. మంత్రి వెంకట్ రెడ్డి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది మహేశ్ గౌడ్ నాయకత్వంలో కాదా? అని ప్రశ్నించారు. సమర్థవంతంగా పనిచేస్తున్న బీసీ నేతను పక్కనపెట్టి అగ్రవర్ణానికి చెందిన మరో నేతకు పదవి ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి కోరడం దేనికి సంకేతం అని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ ఫైర్ అయ్యారు. మహేశ్​గౌడ్ నాయకత్వాన్ని తక్కువ చేయడం అంటే పార్టీ సాధించిన విజయాలను అవమానించడమేనని ఆరోపించారు.

ఆయన వ్యాఖ్యలు బీసీ సామాజిక వర్గానికి చెందిన టీపీసీసీ చీఫ్​మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వాన్ని కించపరచడమేనని, ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? అని ప్రశ్నిస్తూ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తున్న వేళ, సొంత పార్టీ నేతలపై వెంకటరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరమని అభ్యంతరం వ్యక్తం చేశారు…సమర్థవంతంగా పనిచేస్తున్న ఒక బీసీ నేతను పక్కన పెట్టి, మరొకరికి పదవి ఇవ్వాలని డిమాండ్ చేయడం ద్వారా మీరు పార్టీలో చీలికలు తేవాలని చూస్తున్నారా? అంటూ నిలదీశారు. రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ సమర్థవంతమైన పర్యవేక్షణలో పార్టీ తిరుగులేని విజయాలను నమోదు చేస్తోందని, క్షేత్రస్థాయిలో పార్టీ ఇంత బలంగా ఉంటే మహేష్ గౌడ్ నాయకత్వాన్ని తక్కువ చేయడం అంటే అవమానించడమేనని, బీసీల పట్ల అంత కక్ష ఎందుకు? అంటూ ఫైర్ అయ్యారు..

గతంలో నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా పొన్న కైలాష్ నేతని నియమిస్తే.. ఆనాడు ఆ పదవి ఆయనకు రాకుండా అడ్డుకోవాలని చూసింది మీరు కాదా వెంకటరెడ్డి? నాడు జిల్లా స్థాయిలో ఒక బీసీ నేత ఎదుగుతుంటే అడ్డుపడ్డారు. నేడు రాష్ట్ర స్థాయిలో మహేష్ గౌడ్‌కి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకపోతున్నారు. బీసీలంటే మీకెందుకు అంత చులకన? గతంలో వైఎస్, డీఎస్ హాయాంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మహేష్ గౌడ్ హయాంలో ఎందుకు సాధ్యం కాదు? మీ వైఖరి మార్చుకోండి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది. పార్టీలో గందరగోళం సృష్టించేలా, బీసీ నేతలను కించపరిచేలా మాట్లాడటం మానుకోవాలి’ అంటూ వెంకట్ రెడ్డికి అనిల్ హితవు పలికారు…

నాపై కుట్ర కోణం లో ఆలోచిస్తున్న..!

జగ్గారెడ్డిని టీపీసీసీ చీఫ్​చేయాలని తాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరణ ఇచ్చారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌పై తాను ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని, కొందరు ఉద్దేశపూర్వకంగానే తన మాటలను వక్రీకరించి, తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. బుధవారం అసెంబ్లీలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. మహేష్​ కుమార్ గౌడ్‌ను తొలగించాలనే ఆలోచన, ఉద్దేశం తనకు లేదన్నారు. ఆయన తనకు ఎన్ఎస్‌యూఐ నుంచి మంచి స్నేహితుడని, ఆయన నాయకత్వంలో గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ క్లీన్ స్వీప్ చేసిందని వెంకట్ రెడ్డి తెలిపారు.