డిల్లీ…
తెలంగాణలో పార్టీ పిరాయించిన ఎమ్మెల్యే ల పై అనర్హత వేటు పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు..
మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి..
మూడు నెలల్లోనే అనర్హత తేల్చాలని స్పీకర్ను ఆదేశించిన .. సుప్రీం కోర్టు
అక్టోబర్ 31 వరకు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని
పార్టీ మారే ఎమ్మెల్యే ల అనర్హత వేటుపై పార్లమెంట్ లో చట్టం చేయాలి..
బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలు ..
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. తీర్పు వచ్చిన మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అంతకు మించి సమయం తీసుకోవద్దని సుప్రీం సూచించింది. అలాగే న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ‘ఆపరేషన్ సక్సెస్ – పేషెంట్ డెడ్’ అన్న సూత్రం వర్తించకూడదని పేర్కొంది. ఈ వ్యవహారంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల పట్ల పార్లమెంట్ చట్టం తీసుకురావాలని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది…2023లో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై విజయం సాధించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్ లు కొంతకాలం తరువాత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిపై అనర్హత వేటు వేయాలని పలువురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ ను కోరారు. అయినా, స్పీకర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవటంతో.. పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో పలు సార్లు పిటీషన్లపై విచారణ జరిగింది. తాజాగా.. సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించింది. మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ కు ఆదేశాలు జారీ చేసింది..