తెలంగాణ మూడో రోజు ప్రైవేట్ కాలేజీల బంద్ ఫీజు రీఎంబర్స్‌మెంట్‌కోసం ఉన్నత విద్యాసంస్థల సమ్మె..

తెలంగాణ మూడో రోజు ప్రైవేట్ కాలేజీల బంద్
ఫీజు రీఎంబర్స్‌మెంట్‌కోసం ఉన్నత విద్యాసంస్థల సమ్మె.

సెమిస్టర్‌ పరీక్షలు బహిష్కరించిన ఫార్మసీ కాలేజీలు
రీఎంబర్స్‌మెంట్ సంస్కరణలకోసం కమిటీ వేసిన ప్రభుత్వం.

కమిటీలతో కాలయాపన చేయొద్దంటున్న కాలేజీ యాజమాన్యాలు.

50 శాతం బకాయిలు చెల్లించాలని కాలేజీల డిమాండ్.

ప్రభుత్వంస్పందించేవరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపుపై తెలంగాణలోని ప్రైవేట్ విద్యాసంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడంపై నిరసనగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,840 ప్రైవేట్ విద్యాసంస్థలు మూడో రోజు బంద్‌ కొనసాగుతుంది.. డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి ఉన్నత విద్యా సంస్థలు అందులో భాగమవుతున్నాయి. ప్రభుత్వం పూర్తి బకాయిలు విడుదల చేసే వరకు సమ్మె కొనసాగిస్తామని యాజమాన్యాలు స్పష్టం చేశాయి. ఈ నిర్ణయం వల్ల సుమారు 35 లక్షల మంది విద్యార్థుల చదువుపై నేరుగా ప్రభావం పడనుందని అంచనా..