మహిళలకు రూ.2,500 అంటూ పుకార్లు. పోస్ట్ ఆఫీస్ ముందు బారులు తీరిన మహిళలు.

మహిళలకు రూ.2,500 అంటూ పుకార్లు

పోస్ట్ ఆఫీస్ ముందు బారులు తీరిన మహిళలు

వికారాబాద్ జిల్లా పరిగిలో ప్రభుత్వం రూ.2,500 ఇస్తుందని పుకార్లు రావడంతో పోస్ట్ ఆఫీస్ ముందు బారులు తీరిన మహిళలు

మాకు ఎలాంటి సమాచారం రాలేదని, మీకెవరు చెప్పారంటూ మహిళలను అడిగిన పోస్ట్ ఆఫీస్ మేనేజర్

ఒకరి నుండి ఒకరికి సమాచారం వచ్చిందని, అందుకే వచ్చామని సమాధానం ఇచ్చిన మహిళలు..

వికారాబాద్ జిల్లాలోని పరిగిలో ఓ సంఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వం నుండి మహిళలకు నెలకు రూ.2,500 లభిస్తుందని అందిన పుకార్లతో.. పెద్ద సంఖ్యలో మహిళలు పోస్ట్ ఆఫీస్ ముందు బారులు తీరారు. ఈ వార్త ఎక్కడి నుండి వచ్చిందో స్పష్టంగా తెలియకపోయినా.. ఒకరి నుండి ఒకరికి సమాచారం వ్యాపించడంతో వేలాది మంది మహిళలు పోస్ట్ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. ఇది అధికారులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది..

పోస్ట్ ఆఫీస్‌కు వచ్చిన మహిళల రద్దీని చూసి పోస్ట్ ఆఫీస్ మేనేజర్ ఆశ్చర్యపోయారు. తమకు అలాంటి ఎలాంటి సమాచారం అందలేదని.. అసలు ఈ విషయం మీకు ఎవరు చెప్పారని ఆయన మహిళలను ప్రశ్నించారు. దీనికి బదులుగా.. ‘ఒకరి నుంచి మరొకరికి సమాచారం వచ్చిందని, అందుకే తాము వచ్చామని’ మహిళలు సమాధానం ఇచ్చారు.