హైదరాబాద్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక.
తెలంగాణ సీఎం హైదరాబాద్ అభివృద్ధిపై కీలక ఆదేశాలు జారీ చేశారు. గత 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించాలన్నారు. మూసీ నదిపై బ్రిడ్జి-బ్యారేజీలు, జూపార్క్ సమీపంలో హోటల్ నిర్మాణం, మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధిని వేగవంతం చేయాలన్నారు. హైదరాబాద్‌ను కాలుష్యరహిత నగరంగా మార్చేందుకు సంస్కరణలు తీసుకురావాలన్నారు..
ఎకరం రూ.104 కోట్లు.. హైదరాబాద్‌లో భూముల వేలం!
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని 66 ఎకరాల ప్రభుత్వ భూములను టీజీఐఐసీ ద్వారా వేలానికి ఉంచనుంది. రాయదుర్గంలో 19.67 ఎకరాలు, ఉస్మాన్ సాగర్‌లో 13 ప్లాట్లు ఈ వేలంలో భాగం. టెండర్ దాఖలుకు గడువు ఆగస్టు 8 వరకు ఉండగా, 12వ తేదీన అవార్డు ప్రకటిస్తారు. రాయదుర్గం మార్కెట్ ధర చదరపు గజానికి ₹2,16,405, అప్సెట్ ధర ₹1,51,484గా ఉంది. ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చే అవకాశం కనిపిస్తోంది…
జూబ్లీహిల్స్‌తో పాటు ఆ 5 నియోజకవర్గాలకు బైపోల్ వస్తుందా..?
పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గ్రేటర్, రంగారెడ్డి పరిధిలోని 5 నియోజకవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. దానం (ఖైరతాబాద్), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్), గూడెం మహిపాల్ (పటాన్చెరు), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), యాదయ్య (చేవెళ్ల) BRS నుంచి INCలో చేరారు. నేడు తీర్పుతో జూబ్లీహిల్స్‌తో పాటే ఈ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక వస్తుందా..? అని ప్రజలు చర్చించుకుంటున్నట్లుగా సోషల్ మీడియాలో వైరల్..
ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ మహిళలకు నిజంగానే శుభవార్త స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రభుత్వం వారికి గొప్ప కానుక అందించనుంది. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు నిన్న గుంటూరులో ప్రకటించారు. ఈ చరిత్రాత్మక నిర్ణయం లక్షలాది మంది మహిళల జీవితాల్లో పెను మార్పు తీసుకురానుంది.జోన్-3 పరిధిలోని గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, నెల్లూరు జిల్లాల అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ పథకం వివరాలను ఎండీ తిరుమలరావు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, జోనల్ చైర్మన్ సురేశ్‌రెడ్డి చర్చించారు. “రాష్ట్రంలో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆధార్ కార్డు వంటి గుర్తింపు కార్డు చూపించడం తప్పనిసరి” అని ఎండీ తెలిపారు.పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా త్వరలో 1,050 కొత్త బస్సులు ఆర్టీసీకి రానున్నాయి. డీజిల్ బస్సుల స్థానంలో క్రమంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని, విజయవాడ, వైజాగ్‌లలో తదుపరి సమీక్షా సమావేశాలు జరుగుతాయని ఎండీ వెల్లడించారు.ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ “కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ పథకం రాష్ట్ర మహిళలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రస్తుత బస్సులు, సిబ్బందితోనే ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తాం” అని హామీ ఇచ్చారు. త్వరలో విడుదల కానున్న మార్గదర్శకాలతో ఈ పథకంపై మరింత స్పష్టత రానుంది. ఈ నిర్ణయం మహిళలకు ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా వారి ప్రయాణ స్వేచ్ఛను మరింత పెంచుతుంది..
రంగారెడ్డి జిల్లా
గత కొన్ని రోజులగా నార్సింగి మున్సిపాలిటీ పరిధి ఫారెస్ట్ ట్రెక్ పార్కు లో ఫారెస్ట్ అధికారులకు దొరకకుండా తిరుగుతున్న చిరుత పులిని ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు…
గత వారం గురువారం రోజుఒక అధికారికి చిరుత కనిపించగా, అతను ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాడు…
గత గురువారం నుండి వివిధ ప్రాంతాలలో సంచరించిన చిరుత చివరికి పట్టుబడింది…
పట్టుబడిన చిరుతపులీ ని జూపార్క్ తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు…
ఉగ్రవాదుల తలలో తూటాలు దించాం: అమిత్ షా..
పహల్గాంలో దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల తలలో తూటాలు దించామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై రాజ్యసభలో ఆయన మాట్లాడారు. మతానికి సంబంధించిన వివరాలు అడుగుతూ మహిళలు, చిన్నారుల ముందే ఉగ్రవాదులు అత్యంత అనాగరిక చర్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పహల్గాం దాడిలో లష్కరే తొయిబా హస్తం ఉందని, ‘ఆపరేషన్ మహాదేవ్’లో మరణించిన ముగ్గురు ఉగ్రవాదులతో ఈ విషయం స్పష్టంగా తెలిసిందన్నారు…
*భారతీయ మహిళలో యూనిక్ బ్లడ్ గ్రూప్..!!*
ప్రపంచంలో ఎవరికీ లేని బ్లడ్ గ్రూప్ ఓ కర్ణాటక మహిళలో (38) బయటపడింది. 0+ బ్లడ్ ఉన్న మహిళ 2024 FEBలో హార్ట్ సర్జరీ కోసం ఆస్పత్రిలో చేరారు.
చికిత్స సమయంలో ఆమె రక్తం ఇతరుల రక్తంతో మ్యాచ్ కాలేదు. ఆమె రక్తాన్ని UK ల్యాబ్‌కు పంపగా యూనిక్ యాంటిజెన్ ఉన్నట్లు తేలింది.
దీనికి CRIB (క్రోమర్ ఇండియా బెంగళూరు) అనే పేరు పెట్టారు. ఈ బ్లడ్ ఉన్నవారికి ఇతరుల రక్తం పనిచేయదు. వాళ్ల బ్లడ్‌నే ముందస్తుగా స్టోర్ చేయాలి..!!.
నీళ్ల కోసం ఎమ్మెల్యే అడ్డుకున్న రైతులు.
నల్గొండ జిల్లా……..
గుడిపల్లి మండల కేంద్రంలో దేవరకొండ MLA బాలునాయక్ నీ గుడిపల్లి గ్రామ రైతులు అడ్డుకోవడం జరిగింది మాగ్రామానికి 7b కెనాల్ వాటర్ విడుదల చేయాలనీ MLA నీ నిలదీయడం జరిగింది సముద్రం లో నీళ్లు వృధా పోతున్న మాకు నీరు ఇవ్వకుండా మా పంట పొలాలు ఎండిపోతున్నయిని వాళ్ళు MLA ఎదుట వాపోయారు నీళ్లు వదిలేదాకా MLA నీ వెళ్ళనిచేది లేదు అని రైతులు రోడ్డు మీద బైటయించి నిరసన వ్యక్తం చేశారు.