తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్‌ ప్రమాణ స్వీకారం…!

మాజీ క్రికెటర్‌, కాంగ్రెస్‌ నేత మహమ్మద్‌ అజారుద్దీన్‌ ఇవాళ తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కూడా హాజరయ్యారు.

అంతకు ముందు రాజ్ భవన్‌లో ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాజ్ భవన్ దర్బార్ హాల్‌ను ప్రోటోకాల్ అధికారులు పరిశీలించారు.మంత్రి ప్రమాణ స్వీకారానికి సీటింగ్, తదితర అంశాలపై అధికారుల ఏర్పాట్లు చేసారు. అజారుద్దీన్ కు మైనారిటీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు అప్పగించారు..