సూర్యాపేట జిల్లా….
పాలకీడు మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పొలాలని సందర్శించి రైతులను ఓదార్చిన brs యూత్ నాయకులు……..
బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు పెరుమల్ల సతీష్ మాట్లాడుతూ..
ప్రభుత్వం వెంటనే రైతులకు పంట నష్టం కింద 20 వేల రూపాయలను ప్రకటించాలని అన్నారు… పాలకిడు కేంద్రంలో మొంథా తుఫాను వల్ల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతుల పొలాలను సందర్శించి రైతులకు ధైర్యం ఇచ్చారు ఆరు కాలాలు ఎంతో కష్టపడి పండించిన పంటలు నీటిపాలు కావడంతో రాష్ట్రంలోని రైతుల బాధలు మిన్నంటుతున్నాయి ..
పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా పంట నుండి వచ్చే పరిస్థితి అయితే ఎక్కడ కూడా కనబడటం లేదు అని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన ప్రతి ఎకరాకు 20వేల రూపాయల చొప్పున వెంటనే నష్టపరిహారం ప్రకటించాలని బిఆర్ఎస్ పార్టీ నుండి డిమాండ్ చేశారు ..
ప్రభుత్వం వెంటనే పంట నష్టం ప్రకటించకపోతే , బిఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన తప్పకుండా పోరాడుతుందని హెచ్చరించారు ..
ఇట్టి కార్యక్రమంలో మంద నాగయ్య, నాగిరెడ్డి, వీరబాబు, కరుణాకర్ ,సిద్దు, వీరబాబు యాహోన్ , అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు..