తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్….(KTR)
ప్రజలకు కృతజ్ఞతలు: అధికార పార్టీ ఎన్ని అక్రమాలు చేసినా, ధైర్యంగా బీఆర్ఎస్కు ఓటు వేసిన ప్రజలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
ఫలితాల విశ్లేషణ: ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ 30 శాతానికి పైగా వార్డులను గెలుచుకుందని, మొత్తం మీద మంచి ఫలితాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. 15 మున్సిపాలిటీల్లో స్పష్టమైన విజయం సాధించామని, మరో 37 చోట్ల హంగ్ ఏర్పడిందని తెలిపారు…ప్రధాన ప్రతిపక్షంగా సఫలం: కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంలో ప్రధాన ప్రతిపక్షంగా తాము సఫలమయ్యామని, అందుకే ప్రజల నుంచి మద్దతు లభిస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు.
2,581 మున్సిపల్ వార్డులలో ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ 750 వార్డులు గెలిచింది. ఈ ఎన్నికల్లో కూడా 30 శాతానికి పైగా సీట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం 40 శాతానికి పైగా ఓటు బ్యాంకు సాధించామని గుర్తు చేశారు. దాదాపు 35 స్థానాలకు పైగా హంగ్ ఏర్పడిందని, 16 స్థానాలకు పైగా బీఆర్ఎస్ గెలిచింది. ఇక వాళ్లు గెలిచింది ఎన్ని అని కేటీఆర్ అన్నారు.
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఎదుర్కొంటామన్నారు. బీజేపీని నిలువరించేందుకు సింగరేణి ప్రాంతంలో సీపీఐతో కలిసి పోరాడామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ సింగరేణి గొంతు కోస్తున్నాయని మండిపడ్డారు. సింగరేణిలో జరిగిన అవినీతిని ఆధారాలతో బయటపెడితే బీజేపీ సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు కాపాడుతుందో తెలియడం లేదన్నారు.
సింగరేణిలో జరుగుతున్న అరాచాకాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. సింగరేణిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలన్నారు. హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలన్నారు. రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పే రోజులు త్వరలోనే వస్తాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో సైనికుల్లా పోరాటం చేసిన బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, సోషల్ మీడియాలో అండగా నిలబడ్డ తమ్ముళ్లకు, చెల్లెలకు, ఓటేసిన ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు..
కాంగ్రెస్‌పై విమర్శలు: అధికార దుర్వినియోగానికి పాల్పడి, అధికారులను అడ్డం పెట్టుకుని కొన్ని చోట్ల కాంగ్రెస్ విజయం సాధించిందని ఆయన ఆరోపించారు. హంగ్ ఏర్పడిన చోట ఛైర్మన్ పీఠాల కోసం కాంగ్రెస్ బేరసారాలు మొదలుపెట్టిందని విమర్శించారు.
సీపీఐకి మద్దతు: కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్, బీజేపీలను ఎదుర్కొనేందుకు సీపీఐకి మద్దతు ఇస్తామని, ఈ విషయంపై సీపీఐ నేత కూనంనేని సాంబశివరావుతో మాట్లాడానని కేటీఆర్ వెల్లడించారు..
రాజీనామా సవాల్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నమ్మకం ఉంటే, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని కేటీఆర్ సవాల్ విసిరారు.
భవిష్యత్తులో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కొత్త కార్యాచరణ రూపొందిస్తామని, కలిసొచ్చే తటస్థులను కలుపుకొని పోతామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు..