GOOD NEWS:
తెలంగాణ రాష్ట్రంలో భానుడి భగభగలకు బ్రేక్ పడే సమయం ఆసన్నమైంది. ఎండ తీవ్రత, ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలోనే తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు..
ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ ఊరటనిచ్చింది. అండమాన్ సముద్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించగా, మే 26న కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని తెలిపింది. జూన్ తొలి వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు చేరుకునే అవకాశముందని అంచనా వేసింది. దీంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. అయితే మరో 4 రోజుల పాటు ఎండల తీవ్రత కొనసాగుతుందని హెచ్చరించింది.