బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం.. తృటిలో తప్పిన పెను విషాదం.!

బ్రెజిల్‌లో కూలిన నిర్మాణ క్రేన్‌ను ఢీకొట్టిన..
బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం.. తృటిలో తప్పిన పెను విషాదం!

సావో పాలోలో భారీ నిర్మాణ క్రేన్‌ను ఢీకొట్టిన డ్రైవర్‌లెస్ రైలు!

ఎలివేటెడ్ రైల్వే ట్రాక్‌పై క్రేన్ కూలిన సమయంలో అటుగా వచ్చిన ఆటోమేటెడ్ రైలు!

క్రేన్‌ను బలంగా ఢీకొట్టడంతో కింద రద్దీగా ఉన్న రోడ్డుపై పడిన శిథిలాలు!

అదృష్టవశాత్తూ ప్రయాణికులంతా క్షేమం.. క్రేన్ ఆపరేటర్‌కు గాయాలు!

డ్రైవర్‌లెస్ రైలు.. రోడ్డుపై పడిన బ్రిడ్జికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.!

బ్రెజిల్‌లోని సావో పాలో నగరంలో డ్రైవర్ లేని రైలు కూలిపోయిన నిర్మాణ క్రేన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శిథిలాలు కింద ఉన్న రోడ్డుపై పడ్డాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాదంలో గాయాలు, ప్రాణనష్టం జరగలేదు..