తెలంగాణ రాష్ట్రానికి కొత్త చీఫ్ సెక్రటరీగా సంజయ్ జాజు ఐఎఎస్ నియామకం.
ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు -కొత్త సీఎస్‌గా 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియామకం -ఇటీవలే తెలంగాణ క్యాడర్‌కు తిరిగి వచ్చిన సంజయ్ జాజు..
సంజయ్ జాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
1992 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్‌జాజు,తెలంగాణ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్.
మూడు రోజుల కిందట కేంద్ర సర్వీసుల నుంచి సంజయ్ జాజు రిలీవ్.
ఈ నెల 30న పదవీ విరమణ పొందనున్న ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు
*తెలంగాణ లో 13 మంది ఐఏఎస్ లు బదిలీ…*
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
జీఓ ఆర్టీ నెం.914 విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం.
సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్. శ్రీధర్ నియామకం.
ఎండోమెంట్స్ నుంచి ఈఎఫ్ఎస్ అండ్ టీ శాఖకు శైలజా రామయ్యర్ బదిలీ.
పొలిటికల్ జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా అహ్మద్ నదీమ్ పోస్టింగ్.
డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా రాహుల్ బొజ్జా.
ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా అజిత్ రెడ్డి నియామకం.
టీజీఆర్‌ఈడీసీఓ వీసీ & ఎండీగా ముషర్రఫ్ అలీ ఫారూఖీకి అదనపు బాధ్యతలు.
హ్యాండ్లూమ్స్ & టెక్స్టైల్స్ స్పెషల్ సీఎస్‌గా పి. కాత్యాయిని దేవి.
టీజీఆర్‌ఈఆర్‌ఏ ఈడీ కె. గంగాధర్‌కు ఆర్&బీ శాఖలో పోస్టింగ్.
జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా టి. వెంకన్న బదిలీ.
టూరిజం డైరెక్టర్‌గా కె. విద్యాసాగర్ నియామకం.
హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా కే. చంద్రకళకు ఎఫ్ఏసీ బాధ్యతలు.
ప్రభుత్వం నూతన ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా సంజయ్ జాజు నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీఎస్‌గా కొనసాగుతున్న రామకృష్ణారావు ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో సంజయ్ జాజును ప్రభుత్వం నియమించింది.
రాష్ట్రానికి పంపుతూ కేంద్రం నిర్ణయం :కేంద్ర సర్వీసులో ఈశాన్య ప్రాంత అభివృద్ధి కార్యదర్శిగా పని చేస్తున్న సంజయ్ జాజును తెలంగాణ రాష్ట్రానికి పంపుతూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రధాన కార్యదర్శి పోస్టుకు సంజయ్ జాజుతో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ పేరును కూడా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. చివరికి సంజయ్ జాజు వైపే ఆయన మొగ్గు చూపారు.
2014 నుంచి కేంద్ర సర్వీసులో :రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు, కేంద్ర సర్వీసు నుంచి ఇటీవలే తెలంగాణ క్యాడర్‌కు తిరిగి వచ్చారు. ప్రారంభంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సబ్ కలెక్టర్‌గా, పశ్చిమగోదావరి కలెక్టర్‌గా, హైదరాబాద్ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌గా, కమిషనర్‌గా పని చేశారు. 2014 నుంచి కేంద్ర సర్వీసులో ఉన్నారు. సంజయ్ జాజు 2029 ఫిబ్రవరి వరకు సర్వీసులో ఉండనున్నారు..