తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తొలి సమావేశం…!

HYD: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తొలి సమావేశం.

_• కమిటీ చైర్మన్‌ కే.కేశవరావు అధ్యక్షతన జరిగిన సమావేశం.
_• అమరవీరుల గుర్తింపు కోసం త్వరలో ఆల్‌ పార్టీ సమావేశం._
_• ఉద్యమకారులను గుర్తించేందుకు 4 రకాల ప్రతిపాదనలు సిద్ధం చేసిన కమిటీ.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలొడ్డి పోరాడిన ఉద్యమకారులను గుర్తించి, వారికి తగిన గౌరవం, సాయం అందించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. తాజాగా సీనియర్ నేత కే కేశవరావు (K Keshava Rao) చైర్మన్‌గా ఏర్పాటైన ‘తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ’ తొలిసారిగా సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యమకారులను ఎలా గుర్తించాలి? వారికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి? అన్న దానిపై ఒక రోడ్ మ్యాప్ (Road map) సిద్ధం చేసింది…..ఈ సమావేశంలో కమిటీ చైర్మన్ కేశవరావుతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డి పాల్గొన్నారు. కమిటీని అధికారికంగా ఏర్పాటు చేసినందుకు ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కమిటీ కార్యకలాపాలు సాఫీగా సాగేందుకు వీలుగా, హైదరాబాద్‌లోని ‘అమరవీరుల జ్యోతి’ (Martyrs Memorial) కింద ఉన్న ఆఫీస్‌లో కమిటీకి ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు…